- Amaravati farmers: రైతులపై అడుగడుగునా పోలీసు జులుం.. 27 నెలల్లో 3,852 కేసులు
Cases on Amaravati farmers: వాళ్లేమీ ఉగ్రవాదులు కాదు... తిరుగుబాటుదారులు అసలే కాదు... తరతరాలుగా వారసత్వంగా వస్తున్న కన్నతల్లి లాంటి భూములను రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు... ఆ భూమిపైనే ఆధారపడి బతికిన రైతు కూలీలు... మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యమించారు... పట్టువిడవకుండా ఏకధాటిగా 807 రోజులపాటు తీవ్ర నిర్బంధాలు, ఆంక్షల నడుమ పోరాటాన్ని కొనసాగించారు... ఆగ్రహించిన ప్రభుత్వం తమపై 27 నెలల్లో 3,852 కేసులు పెట్టారంటూ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Sharif on Amaravathi: నేను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాను: షరీఫ్
శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పెట్టాలని చూసినప్పుడు తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాననటానికి.. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, 3రాజధానుల బిల్లులపై తాను సంతకం పెట్టకపోవటంతోనే ప్రభుత్వానికి న్యాయస్థానంలో చిక్కులు ఎదురై, బిల్లుల్ని వెనక్కి తీసుకుందని తెలిపారు. బిల్లుల ఆమోదం కోసం తనను ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. నాడు మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నడుచుకున్నానే తప్ప రాజకీయంగా కాదంటున్న షరీఫ్‌తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.
- 'చలో ఆంధ్ర వర్సిటీ’ ఉద్రిక్తం... ఎక్కడికక్కడ నేతల ముందస్తు అరెస్టు
Andhra University: ఆంధ్ర వర్సిటీ పూర్వ విద్యార్థుల 'చలో ఆంధ్ర విశ్వవిద్యాలయం' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. బుధవారం రాత్రి నుంచి ఏయూ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
- Milan-2022: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు
Milan-2022: మిలన్ 2022లో యుద్ధ విన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నౌక ప్రదర్శనలు జరుగుతున్నాయి. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
- బిహార్‌లో భారీ పేలుడు- ఐదుగురు మృతి
Bihar blast: బిహార్ భాగల్పుర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తాతార్పుర్ పోలీస్ స్టేషన్ పరిధి, కాజ్వాలీచక్ ప్రాంతంలోని ఓ ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడుతో భయబ్రాంతులకు గురయ్యారు ప్రజలు.
- సుమీలో 700 మంది భారత విద్యార్థులు- 7 రోజులుగా బిక్కుబిక్కుమంటూ..
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'ఆపరేషన్ గంగ' పేరుతో స్వదేశానికి తీసుకువస్తోంది. అయితే సుమీ నగరంలోని విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయాన్ని 'ఈటీవీ భారత్'కు ఫోన్లో వివరించిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఆ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోయారు.
- అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి.. ఐఏఈఏ ఆందోళన
Ukraine Nuclear Power Plant: ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రం జపోరిజ్జియాపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ క్రమంలో ఓ రియాక్టర్ ధ్వంసమై మంటలు వ్యాపించాయి. ఇది పేలుడుకు గురైతే చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు ఎక్కువ నష్టం ఉంటుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు.
- Commodity Trading: బంగారం, వెండిపై పెట్టుబడులు లాభదాయకమా?
Commodity Trading: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బంగారం, వెండి, వ్యవసాయోత్పత్తులపై మదుపరులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని.. కమొడిటీస్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అగ్రశ్రేణి పెట్టుబడి సంస్థలు అంచనా వేస్తున్నాయి.
- గుండెపోటుతో దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
Rod Marsh: ప్రముఖ క్రికెటర్, దిగ్గజ వికెట్‌కీపర్ రాడ్ మార్ష్ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు వచ్చిన వారం అనంతరం కన్నుమూశారు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో ఎన్నో ఘనతలు సాధించారు మార్ష్.
- ప్రభాస్‌ను అలా చూసి ఆశ్చర్యపోయా: నటి భాగ్యశ్రీ
Bhagya sree: అందాల తారగా భారతీయుల మదిలో తనదైన ముద్ర వేసుకున్న నటి భాగ్యశ్రీ.. రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 'ప్రేమ పావురాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె ఇటీవలే 'రాధేశ్యామ్' చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ పలు ఆసక్తికరమైన సంగతులను తెలిపింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ప్రధాన వార్తలు @ 9 AM