- వైకాపావి నవరత్నాలు.. కాదు నవమోసాలు: చంద్రబాబు నాయుడు
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్ అని విమర్శఇంచారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతి ఉపఎన్నికల్లో వాలంటీర్ల ప్రచారం
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్ సంతకం, సందేశంతో పంపిన లేఖలను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవ్వూరు వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో.. గోదావరిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దాచేపల్లి వద్ద ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి పనుల నిమిత్తం తెలంగాణలోని నల్గొండ జిల్లా యాదగిరిపల్లి నుంచి గుంటూరు వైపు వ్యవసాయ కార్మికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పని చేస్తోన్న బ్యాంకుకే కన్నం- రూ.4 కోట్లు చోరీ
పని చేస్తోన్న బ్యాంకుకే కన్నం వేసి రూ.4 కోట్లు కాజేశాడు ఓ సెక్యూరిటీ గార్డు. పంజాబ్లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు పోలీసులు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర