ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM
ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Mar 7, 2021, 8:58 AM IST

  • వైకాపాకూ తప్పని అంతర్గత పోరు.. మున్సిపల్ బరిలో భారీగా రెబెల్స్

నగర, పుర బరిలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. వారికి టికెట్ రాకపోవడంతో.. ఎన్నికల్లో తిరుగుబాటుదారులుగా పోటీ చేస్తున్నారు. అధిష్ఠానం బుజ్జగింపులతో కొందరు నామినేషన్లే వేయలేదు. మరికొందరు రెబల్స్​గా గట్టీ పోటీ ఇస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఇకపై పౌర సేవలు మరింత త్వరగా.. కసరత్తు వడివడిగా..!

వివిధ సేవల్లో ప్రజల ఫిర్యాదుల నియంత్రణకు సులువైన మార్గాలు వెతకాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదివరకే సూచించింది. వారి ఆదేశాల మేరకు మెరుగైన సేవలకై పురపాలకలో ప్రజలు దరఖాస్తు చేసిన 7 నుంచి 15 రోజుల్లోగా పరిష్కారం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • బంగాల్​ దంగల్​: తొలి దశకు భారీ భద్రతా ఏర్పాట్లు

శాసనసభ ఎన్నికలకు బంగాల్ సర్వం సిద్ధం అవుతోంది. మార్చి 27న జరగనున్న తొలి దశ పోలింగ్​కు భద్రత కోసం 415 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతోంది ఎన్నికల సంఘం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • దీదీపై 50వేల ఓట్ల తేడాతో గెలుస్తా: సువేందు

వచ్చే బంగాల్​ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీ చేసి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడిస్తానని భాజపా నాయకుడు సువేందు అధికారి తెలిపారు. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​!

కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. గుజరాత్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫిబ్రవరి 15న వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోగా.. ఆయనకు జ్వరం వచ్చింది. పరీక్షల్లో.. వైరస్ సోకిందని తేలింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'కరోనా ప్యాకేజీ' బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

1.9 ట్రిలియన్ డాలర్ల కారోనా ప్యాకేజీ బిల్లుకు అమెరికా సెనేట్​ ఆమోదం తెలిపింది. దాదాపు రిపబ్లికన్​ సభ్యులంతా వ్యతిరేకించిన ఈ బిల్లు 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వల్ల అమెరికా చాలా కాలం నష్టపోయిందని, అందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బొమ్మల పరిశ్రమకు చేయూతగా కేంద్రం ప్రణాళిక!

దాదాపు రూ.9 వేల కోట్ల విలువైన భారతీయ ఆటబొమ్మల పరిశ్రమ రాబోయే అయిదేళ్లలో ఏడాదికి 12.2 శాతం చొప్పున అభివృద్ధిని సాధించే అవకాశముంది. ప్రస్తుతం పాతిక లక్షల మంది కార్మికులకు (వీరిలో సగం మంది మహిళలు) ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం బాగా విస్తరిస్తే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • భారత్​ అక్కడ గెలిస్తే ఈ తరంలోనే ఉత్తమ జట్టుగా నిలుస్తుందా?

భారత్​తో నాలుగు టెస్టుల సిరీస్​ను గెలుపుతో ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు.. తర్వాత ఆడిన మూడింట పరాజయం పాలైంది. తమ బ్యాట్స్​మెన్ల వైఫల్యానికి మన పిచ్​లను విమర్శించారు ఆ దేశ క్రికెట్ మాజీలు. చివరికి నాలుగో టెస్టులో భారత లోయర్ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు కలిపి చేసిన పరుగులు కూడా చేయలేకపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఓ స్నేహం.. కారు డ్రైవర్‌ను కోటీశ్వరుణ్ణి చేసింది!

మలయాళ ప్రముఖ నిర్మాత ఆంటనీ పెరుంబావూరు.. ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన గతంలో మోహన్​లాల్ దగ్గర కారు డ్రైవర్​గా చేశారని మీకు తెలుసా? ఇంతకీ ఆంటనీ కథేంటి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details