- ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవు: ఎస్‌ఈసీ
పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్‌ఈసీ తిరస్కరించింది. ఈ సమయంలో బదిలీలు తగవని హితవు పలికింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సర్వోన్నత న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌జీవోలు, ఉద్యోగ సంఘాల సమాఖ్య, వైద్యుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సుప్రీం తీర్పుతో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
సుప్రీం తీర్పుతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. క్షేత్రస్థాయి అధికారులకు... ప్రాథమికంగా మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా 2019కి చెందిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయటంతో పాటు... నామినేషన్ల కోసం తగు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు.... గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు సహా ఇతర అధికారులను బదిలీ చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి సాధ్యం కాదు'
ధర్మాసనాల ఆదేశాల దృష్ట్యా రాష్ట్రంలో ఒకేసారి పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ నిర్వహించాల్సి ఉన్నందున.... తగు మార్గదర్శకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో 5 లక్షల మంది పాల్గొనాల్సి ఉన్నందున... టీకా పంపిణీ కార్యక్రమానికి ఆటంకం కలగొచ్చని... ఓ దఫా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎన్నికల దృష్ట్యా రెండో డోసు ఇవ్వడం క్లిష్టంగా మారిందని పేర్కొంది. వీటిపై కేంద్ర సహకారాన్ని కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గణతంత్ర కవాతుకు సిద్ధమైన రైతులు
సాగు చట్టాల రద్దు కోసం చేస్తోన్న పోరాటంలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీ శివార్లలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రైతులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లైవ్ అప్డేట్స్: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు