ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - లేటెస్ట్ అప్ డేట్స్

ప్రధాన వార్తలు @ 9 AM

Top News @ 9 AM
Top News @ 9 AM

By

Published : Sep 24, 2020, 8:59 AM IST

  • శ్రీవారి సేవలో ముఖ్యమంత్రులు జగన్, యడియూరప్ప

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం సుందరకాండ పారాయణానికి హాజరయ్యారు. తర్వాత.. కర్ణాటక అతిథిగృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొడాలి వ్యాఖ్యలు నిరసిస్తూ భాజపా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్​పై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను భాజపా ఖండించింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మంత్రి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి... కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు భాజపా పిలుపునిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్​ ఎస్​.మహేంద్రదేవ్​తో ప్రత్యేక ముఖాముఖి

విశాలమైన భారతదేశం అంతటా పంటల క్రయవిక్రయాలకు ఒకే చట్టం అక్కర్లేదని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ స్పష్టం చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన పంటలు సాగవుతాయని, వినియోగంలోనూ తేడాలున్నాయని.. పరిస్థితులూ వేరని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నేడు సరిహద్దుల్లో వంతెనలను ప్రారంభించనున్న రాజ్​నాథ్​

దేశ సరిహద్దు ప్రాంతాల్లోని 43 వంతెనలను గురువారం జాతికి అంకితమివ్వనున్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వీటిలో 7బ్రిడ్జీలు లద్దాఖ్​కు చెందినవే. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ వంతెనలు అందుబాటులోకి రావడం భారత సైన్యానికి కలిసొచ్చే విషయం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అధ్వానంగా ఆఫ్​సెట్​ విధానం.. అందని ప్రతిఫలం

విదేశీ సంస్థలతో భారత్​ అనుసరిస్తున్న ఆఫ్​సెట్​ విధానంపై నివేదికను వెల్లడించింది కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​(కాగ్​). ఆయా సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతికతల బదిలీలో దేశ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ఈ మేరకు తన నివేదికను పార్లమెంట్​కు సమర్పించింది కాగ్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • టిక్​టాక్​పై నిషేధాన్ని అడ్డుకోవాలని కోర్టుకు వినతి

ట్రంప్ ప్రభుత్వం తమ యాప్‌ను నిషేధించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చైనాకు చెందిన టిక్‌టాక్.. ఫెడరల్​ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్ ఆదేశాలు చట్ట విరుద్ధమని, జాతీయ భద్రత పేరుతో తమపై నిషేధం విధించలేరని పేర్కొంది. తమ వీడియో షేరింగ్ యాప్​ను ఒరాకిల్, వాల్‌మార్ట్‌తో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకోలేమని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు అబద్ధాలని చైనా విమర్శించింది. ట్రంప్ ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే చేశారని పేర్కొంది. చైనా కూడా వైరస్ బాధిత దేశమే అంటూ చెప్పుకొచ్చింది. డబ్ల్యూహెచ్​ఓను చైనా నడిపిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలనూ తప్పుబట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జియో కొత్త ప్లాన్ల​తో- ఎయిర్​టెల్, వీ విలవిల!

చౌక ధరలో పోస్ట్​పెయిడ్ ప్లాన్స్​ను విడుదల చేస్తూ.. రిలయన్స్ జియో చేసిన ప్రకటన ప్రత్యర్థి టెలికాం సంస్థలకు భారీ నష్టాలను మిగిల్చింది. జియో మంగళవారం చేసిన ఈ ప్రకటనతో బుధవారం స్టాక్ మార్కెట్​లో ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎన్​సీఏ కోచ్​లకు టాటా.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్​

కరోనా మహమ్మారి కారణంగా జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)లో కార్యకలాపాలకు బ్రేక్​ పడింది. దీంతో ప్రస్తుత ఒప్పంద కోచ్​లను పునరుద్ధరించడానికి నిరాకరించింది బీసీసీఐ. అయితే త్వరలోనే కోచ్​ల కోసం కొత్తగా ప్రకటన విడుదల చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్​ గంగూలీ తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'పుష్ప'రాజ్​ షూటింగ్​కి వచ్చే వేళాయే!

కరోనా కారణంగా ఆగిపోయిన 'పుష్ప' చిత్రీకరణ త్వరలోనే పునఃప్రారంభం కానుంది. కేరళ అడవుల్లో నవంబరు మొదటి వారం నుంచి జరగనున్న షూటింగ్​లో అల్లు అర్జున్​ అడుగుపెట్టనున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details