- నేడు తిరుమలకు సీఎం: తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం
ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ తెదేపా నేతలు సీఎంను డిమాండ్ చేస్తూ.. నిరసనకు సిద్ధమవడంపై చర్యలు తీసుకున్నారు. తెదేపాతో పాటు.. కొందరు భాజపా నేతలను సైతం గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. నేడు మరోసారి సమావేశం
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. సమావేశ వివరాలను సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించలేదు. భేటీ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'త్వరలో డీఎస్సీ-2020... ఆధునీకరించిన సిలబస్‌తోనే టెట్ '
డీఎస్సీ-2018కి సంబంధించి కోర్టుల్లో వివాదం పరిష్కారమైందని...విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.ఎస్జీటీ పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ఉపాధ్యాయుల బదిలీపై రేషనలైజేషన్ సహా అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని...రెండు, మూడ్రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దళిత యువకుడి మృతి కేసు: కౌంటర్ దాఖలుకు హైకోర్ట్ ఆదేశం
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడి జరిగిన సమయంలో.. పోలీసులపై ఐపీసీ సెక్షన్ 324 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను.. ఆ యువకుడు మృతి చెందాక సెక్షన్ 302 (హత్యా నేరానికి శిక్ష) కిందకు ఎందుకు మార్చలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరుగుతున్న రికవరీ రేటు... కొత్తగా 7553 మందికి కొవిడ్ పాజిటివ్
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 7,553 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అవుతున్నా తూర్పుగోదావరి జిల్లా మాత్రం కరోనా హాట్ స్పాట్ కేంద్రంగానే కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాలిబన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ