ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - india updates

ప్రధాన వార్తలు @ 9 AM

Top News @ 9 AM
Top News @ 9 AM

By

Published : Aug 24, 2020, 8:58 AM IST

  • శాంతిస్తున్న గోదావరి... ముంపులోనే లంక గ్రామాలు

వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గోదావరి నది వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినా... కోనసీమ లంకలు, లోతట్టు ప్రాంతాల్లో వరద కష్టాలు ఇప్పట్లో తీరేలాలేవు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరోనా వ్యాప్తి!

కరోనాకు పల్లె, పట్నం తేడా లేకుండా పోతోంది. అటూ ఇటూ అన్నదే లేకుండా.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. లక్షణాలు లేని వారికీ కోవిడ్ సోకుతున్న విషయం.. సాధారణమైపోయింది. జన సమ్మర్థం ఉండే పట్టణాల్లో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. కానీ.. ఊళ్లలో.. పల్లెల్లో.. ఎందుకు ఇంతగా కరోనా వ్యాప్తి చెందుతోంది? ఇందుకు కారణాలేంటి? మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్పలు

కృష్ణా నది వరద ఉద్ధృతితో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాల్లోని పలు పేద కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయి. పలు గ్రామాల్లో వరద ముంచెత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విజయవాడ పరిసరాల్లో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కాంగ్రెస్​ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ

దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యువనేత రాహుల్​ గాంధీకే తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీలో ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. సోనియానే కొనసాగాలని కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం సంతరించకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'అసోం భాజపా సీఎం అభ్యర్థిగా మాజీ సీజేఐ గొగొయి'

మాజీ సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయి.. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారని పేర్కొన్నారు మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత తరుణ్​ గొగొయి. సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించింది భాజపా. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా పంజా.. మెక్సికోలో 60 వేలకు చేరిన మృతులు

కరోనా మహమ్మారి విలయంలో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్​ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2.36కోట్లకు చేరువైంది.. 8.12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ ఉద్దృతి ఎక్కువగా ఉంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

  • కరోనా కాలంలో క్రెడిట్​ కార్డు వాడాలా వద్దా?

కరోనాకు ముందు సినిమాలు చూడటం, షాపింగ్​ చేయడం, రెస్టారెంట్లలో డైనింగ్ వంటివి ఎక్కువగా ఉండేవి. వీటన్నింటికీ క్రెడిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందే వీలుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రయోజనాలు ఏమీ పొందకపోయినా... ఛార్జీల భారం తప్పడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ వార్షిక ఛార్జీలు తగ్గించుకునే వీలుందంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకోండి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'ధోనీని టాప్ ఆర్డర్ లో చూడాలనుకున్నా.. కానీ'

టీమ్​ఇండియా కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. భారీ షాట్లు కొట్టే నైపుణ్యం ఉండటం వల్లే కెరీర్​ ప్రారంభంలో అతడిని ప్రోత్సాహించానని అన్నాడు. టాప్​ఆర్డర్​లో పంపించి, పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొన్నాడు. 2005లో విశాఖపట్నంలో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​ను గుర్తు చేసుకున్నాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఇంగ్లాండ్​తో చివరి టెస్టులో ఓటమి దిశగా పాక్!

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనకబడిన పాకిస్థాన్‌.. చివరిదైన మూడో టెస్టులో ఫాలోఆన్‌ ఉచ్చులో పడింది. పాక్‌ ప్రత్యర్థికి 310 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. కెప్టెన్‌ అజహర్‌ అలీ సెంచరీతో ఆదుకున్నా.. మిగతా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడం వల్ల పాక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌటైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ''ఆదిపురుష్'తో ప్రభాస్ రేంజ్ మరింత పైకి'

ప్రభాస్​ 'ఆదిపురుష్'​ చిత్ర పోస్టర్​ను అందరికన్నా ముందే చూసినట్లు తెలిపాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే అత్యున్నత స్థాయిలో ఉన్న డార్లింగ్​ కెరీర్​.. ఈ చిత్రంతో ఆకాశమే హద్దుగా సాగుతుందని చెప్పాడు. రాముడిపై సినిమా చేయడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details