- CORONA: రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు.. 11 మరణాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,445 కరోనా కేసులు, 11 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ
ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ అవనుంది. ఇందులో గెజిట్ అమలుపై ఉపసంఘం చర్చించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- JAGAN BAIL: జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ
అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు'
మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు సేకరించాకే మంత్రి సురేశ్(minister suresh) దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల(illegal assets) కేసు నమోదు చేసినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. పలువురి ఇళ్లలో సోదాలు జరిపి ఆధారాలు సేకరించినట్లు వివరించింది. ఆధారాలుంటే ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ(CBI) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid-19: కొవిడ్ పుకార్లు భారత్‌లోనే ఎక్కువ..!
కరోనాకు సంబంధించిన పుకార్లు ఎక్కువగా (covid 19) భారత్‌లోనే పుట్టుకొచ్చాయని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 138 దేశాల్లో కొవిడ్-19పై ప్రచారం అయిన తప్పుడు సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐరాస వేదికగా పాక్కు భారత్ చురకలు
ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్లో(UN Human Rights Council) భారత్ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని విమర్శించింది. ఉగ్రమూలాలకు పుట్టినిల్లైన పాక్ నుంచి నీతి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..?
ఆస్పత్రి ప్రాంగణంలో ఉమ్మిన వ్యక్తిపై ఓ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తితోనే.. ఉమ్మిని తూడ్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా దెబ్బకు అప్పులు రెట్టింపు- ఒక్కో కుటుంబానికి...
దేశంలో సగటు కుటుంబాల అప్పులు (Household debt) గత మూడేళ్లలో రెట్టింపైనట్లు ఎస్బీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. కరోనా సంక్షోభంతో (COVID crisis) చాలా మంది అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణంగా తెలిసింది. ఫలితంగా.. సగటు కుటుంబాల అప్పులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.17 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2.34 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెట్లోకి 'లైగర్'.. అఫ్గాన్ పరిస్థితులపై సినిమా
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. లైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, పిప్పా, గార్డ్ చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుడ్న్యూస్.. ఐపీఎల్లో ప్రేక్షకులకు అనుమతి
యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ రెండోదశలో(IPL 2021 2nd Phase) అభిమానులను అనుమతించనున్నారు. అయితే పరిమితంగానే టికెట్లను ప్రేక్షకులకు(IPL 2021 Spectators Allowed) విక్రయిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.