ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @7PM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news at 7pm
ప్రధాన వార్తలు @7PM

By

Published : Jan 10, 2021, 7:00 PM IST

  • లైవ్ వీడియో: విజయనగరంలో బస్సు బీభత్సం

విజయనగరం కలెక్టరేట్ కూడలిలో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కారుమూరి, ఆరిమిల్లి మధ్య మాటల యుద్ధం

పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చెట్టు కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వీర జవాన్ కుటుంబ భూమి కబ్జా...

దేశం తరఫున రెండు యుద్ధాల్లో పాల్గొన్నాడు. భరతమాతను శత్రువుల నుంచి రక్షించేందుకు జరిగిన పోరులో కాలు పోగొట్టుకున్నాడు. అతని త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం... ఉద్యోగ విరమణ అనంతరం సుమారు రెండెకరాల భూమిని ఇచ్చింది. ఆ జవాను మృతిచెందిన అనంతరం సంబంధిత భూమిని కొందరు ఆక్రమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సహకర బ్యాంకుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి'

రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం తొమ్మిదో రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టరు ఆర్‌.ఎస్‌.రెడ్డి.. సహకర బ్యాంకుల వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గెజిటెడ్ అధికారుల్ని ప్యూన్​లుగా మార్చిన యోగి!

చట్ట విరుద్ధంగా పదోన్నతి పొందిన నలుగురు ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు చేపట్టింది యూపీ ప్రభుత్వం. వారి హోదాలను ప్యూన్​, వాచ్​మెన్ స్థాయికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇన్​స్టాలో చైల్డ్ పోర్న్- ఇద్దరు అరెస్టు

సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిపారన్న ఆరోపణలతో ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. వారికి దిల్లీలోని సాకేత్​ న్యాయస్థానం జనవరి 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాలికపై గ్యాంగ్​ రేప్- ఆరుగురు అరెస్ట్

మహారాష్ట్ర నాసిక్​ రోడ్​లో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ డేటా సిస్టమ్​ హ్యాక్​​

న్యూజిలాండ్ కేంద్ర బ్యాంకు డెేటా సిస్టమ్​ను సైబర్​ నేరగాళ్లు హ్యాక్​ చేశారు. కీలకమైన వాణిజ్య, వ్యక్తిగత వివరాలను దొంగిలించారు. కచ్చితంగా ఎంత డేటా, ఎటువంటి డేటా సిస్టమ్స్‌ నుంచి చోరీ అయిందో బ్యాంక్‌ వర్గాలు ఒక పట్టాన చెప్పలేకపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జాత్యహంకార వ్యాఖ్యలు..

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యల విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అ అంశమై ఐసీసీ సహా పలువురు భారత, ఆసీస్ మాజీలు, వర్థమాన ఆటగాళ్లు అభిప్రాయల్ని వెల్లడిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హృతిక్​, దీపిక సినిమా.. క్రేజీ టైటిల్

హృతిక్, దీపిక నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చేసింది. త్వరలో షూటింగ్​ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆదివారం వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details