- వాళ్లే ఆకు రౌడీలు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
తాను ఆకు రౌడీనంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులే ఆకు రౌడీలని, పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ ఘాటుగా బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లేఖలు రాస్తేనే సరిపోదు: సీపీఐ నారాయణ
స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుందని నారాయణ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వామపక్షాల సంపూర్ణ మద్దతు...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న తలపెట్టిన... బంద్‌కు వామపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గంగా రాష్ట్ర బంద్ సాగుతుందన్నారు. ప్రజలంతా బంద్‌ను జయప్రదం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం'
అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని సుబ్బారెడ్డి అన్నారు. తితిదే 2021-2022 సంవత్సరానికి 2,937.82 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్రమత్తత అవసరం..
రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చైనాను చూసి మోదీ భయపడుతున్నారు'