ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

Top News @ 5 PM
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Dec 2, 2020, 5:05 PM IST

Updated : Dec 2, 2020, 5:10 PM IST

  • పోలవరం విషయంలో ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ఆగ్రహం

పోలవరం విషయంలో ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ వీక్షించేందుకు క్లిక్ చేయండి

  • ఏపీ - అమూల్ ప్రాజెక్టు ప్రారంభం

ప్రపంచంలోనే అమూల్‌ సంస్థ 8వ స్థానంలో ఉందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఏపీ - అమూల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అమూల్‌ ద్వారా వచ్చే లాభాలను బోనస్‌గా ఏడాదికి రెండుసార్లు చొప్పున వెనక్కి ఇస్తారని వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జనసేనానిని కలిసిన ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి

వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తండ్రి రెడ్డయ్య యాదవ్... జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిశారు. పెద్దపూడి క్రాస్​ రోడ్డు వద్ద పవన్​ను కలిసిన ఆయన.. రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వం నష్టం అంచనాలు తప్పుల తడకగా ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కఠిన చర్యలుంటాయి'

విశాఖలో ప్రమోన్మాది శ్రీకాంత్ ఘాతుకానికి తెగబడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ వెల్లడించారు. థామ్సన్ స్ట్రీట్​లో ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్న సమయంలో ప్రేమ్ కాజల్ అక్కడే ఉండి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రూ.4 కోట్లు విలువైన ఎర్రచందనం పట్టివేత

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కడప జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. 4 కోట్ల రూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విఫల యత్నం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. పంజాబ్​ యువజన కాంగ్రెస్​ నేతలు .. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ ఇంటి ముట్టడికి ర్యాలీగా బయల్దేరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫైజర్​ వినియోగానికి ఓకే

కొవిడ్​ వ్యాక్సిన్​ ఫైజర్​ వినియోగానికి అనుమతులు ఇచ్చింది బ్రిటన్. ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపిన తొలిదేశంగా నిలిచింది. ఈ క్రమంలో వచ్చేవారం దేశవ్యాప్తంగా టీకా అందుబాటులోకి రానుంది. 2021 చివరి నాటికి 4 కోట్ల డోసులు పొందనున్నట్లు అధికారులు తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారీగా పెరిగింది

పసిడి, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.670కి పైగా ఎగిసింది. వెండి ధర కూడా భారీగా పెరిగి.. కిలో మళ్లీ రూ.62 వేల మార్క్ దాటింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సరికొత్త రికార్డు

టీ20ల్లో ఎక్కువ రేటింగ్ పాయింట్లు తెచ్చుకున్న తొలి బ్యాట్స్​మన్​గా డేవిడ్ మలన్ ఘనత సాధించాడు. భారత్​ క్రికెటర్లు కేఎల్ రాహుల్, కోహ్లీ.. టాప్​-10లో స్థానం సంపాదించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మీ వదినను పరిచయం చేస్తా'

బాలీవుడ్​ స్టార్​ హీరో వరుణ్​ధావన్​.. తన అభిమానులకు ఓ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారు. తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తానని వాళ్లకు చెప్పారు. వరుణ్ 'కూలీ నం.1' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Dec 2, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details