ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @3 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @3 PM

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3pm

By

Published : May 11, 2021, 2:59 PM IST

  • రుయా ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం
    రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారాన్ని సీఎం జగన్​ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు వీటిని అందించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రుయా ఆస్పత్రి ఘటన తీవ్రంగా కలిచివేసింది: సీఎం జగన్
    'స్పందన'పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. కరోనా కాలంలో బాధాకరమైన ఘటనలు జరుగుతున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సీఎం పీఠంపై కూర్చునే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదు'
    సీఎం జగన్ రాజీనామా చేయాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రుయా ఆస్పత్రిలో కొవిడ్ రోగులు మరణించారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అన్నాడీఎంకేలో మళ్లీ వివాదాలు- చీలిక ఖాయమా?
    అన్నాడీఎంకే అగ్రనేతలైన పళనిస్వామి, పన్నీర్​సెల్వం మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. అసెంబ్లీలో విపక్ష పార్టీ డిప్యూటీ లీడర్ పదవిని పళనిస్వామి తిరస్కరించడం వల్ల అభిప్రాయభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి
    కుటుంబ సభ్యులకు తమ నుంచి కరోనా సోకుతుందేమోనన్న భయంతో కర్ణాటకలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వృద్ధురాలు ఉరేసుకొని చనిపోగా.. మరో వ్యక్తి తుపాకీతో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాఠశాలలో కాల్పులు- 11మంది మృతి
    రష్యాలోని కజన్​ ప్రాంతంలో ఓ పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ టీచర్​ కూడా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్లాస్మా దాతల వివరాలు చెప్పే 'సంజీవని'
    కరోనాపై పోరులో తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది స్నాప్​డీల్​. కొవిడ్ రోగుల చికిత్సకు అవసరమయ్యే ప్లాస్మా దాతలను సులభంగా సంప్రదించేందుకు వీలుగా 'సంజీవని' అనే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నాదల్​ను వెనక్కు నెట్టి.. రెండో స్థానానికి మెద్వెదెవ్
    రష్యా స్టార్​ టెన్నిస్ ఆటగాడు డేనియల్​ మెద్వెదెవ్​.. ఏటీపీ ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి చేరుకున్నాడు. స్పెయిన్​ ప్లేయర్​ రాఫెల్​ నాదల్​ మూడో స్థానానికి పడిపోయాడు. జకోవిచ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'గబ్బర్​సింగ్​' సినిమా వచ్చి 9 ఏళ్లైనా క్రేజ్​ తగ్గలా!
    ఓ అభిమాని తన ఆరాధ్య కథానాయకుడి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే, అతడిని ఏ రేంజ్​లో చూపించాడనేదే 'గబ్బర్ సింగ్'. ఈ మాస్​మసాలా బ్లాక్​బస్టర్ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details