- కోర్టుకు హాజరుకాని అధికారులపై హైకోర్టు ఆగ్రహం
ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉపాధి హామీ బిల్లులు ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా.. 4 వారాల్లో 80 శాతం బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం
రేపు రాయలసీమ ఎత్తిపోతల (rayalaseema lift irrigation) పర్యటనకు కృష్ణా (krishna water board) బోర్డు బృందం రానుంది. ఎత్తిపోతల పథకం (rayalaseema lift irrigation) పనుల తనిఖీకి కృష్ణా బోర్డు బృందం వెళ్లనుంది. తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటనకు వెళ్లాలని ఎన్జీటీ (National green tribunal) ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మార్పులేంటో తెలుసా..!
పాలిసెట్ ప్రవేశ పరీక్షలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భౌతిక శాస్త్రంలో ప్రశ్నలను పెంచి.. గణితంలో కుదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి మాధవ్‌రెడ్డి బదిలీ
గవర్నర్ (ap governor) ఏడీసీ మాధవ్‌రెడ్డి బదిలీ అయ్యారు. విజిలెన్స్ విభాగంలో ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీబీఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలకు కేంద్రం సిఫార్సు
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై సర్వీస్ నిబంధనలు అనుసరించి క్రమశిక్షణా చర్యలు తీసకోవాలని కేంద్ర హోంశాఖ సీబీఐ అధికారులకు సిఫార్సు చేసింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు లేఖలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొలువుదీరిన కొత్త కేబినెట్- 29 మంది ప్రమాణం