ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 3 PM - ప్రధానవార్తలు

...

ప్రధాన వార్తలు
Top News

By

Published : Jun 8, 2021, 3:05 PM IST

  • Vaccination: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం కార్యాచరణ

ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం కార్యాచరణను జరుపుతోంది. 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సినేషన్‌ వేయాలన్న నిబంధన నుంచి వీరికి వెసులుబాటు కల్పించనున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • veligonda project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1,365 కోట్లు మంజూరు

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు(veligonda project) నిర్వాసితులకు రూ.1365 కోట్ల నిధులు మంజురయ్యాయి. 4,617 మంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు రూ.1255 కోట్లు మంజరు కాగా.. తీగలేరు, వెలిగొండ ప్రధాన కాల్వ భూసేకరణకు రూ.110 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం(govt) ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • Chandrababu letter: స్నేహపూర్వక పోలీసింగ్ అమలుకు చొరవ చూపాలి: గవర్నర్​కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని.. గవర్నర్(governer) బిశ్వభూషణ్ హరిచందన్(bishwabushan harichandan)​కు.. తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) లేఖ రాశారు. కరోనా తీవ్రతలో.. ఫ్రంట్​ లైన్ వారియర్లు, సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న పోలీసులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'నా భర్త చనిపోయాడు.. అత్త వెళ్లగొట్టింది.. నేనెలా బతకాలి?'

కుమారుడు మరణించిన కొద్ది రోజులకే కోడలిని ఇంటి నుంచి బయటకు పంపేసింది ఓ అత్త. దిక్కుతోచని స్థితిలో తాను చిన్న పిల్లాడితో ఎక్కడికి వెళ్లగలనంటూ ఆ కోడలు రోదిస్తోంది. విషయం తెలుసుకున్న మానవ హక్కుల కమిషన్ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు మన్నెం ఉష.. బాధితురాలితో కలిసి ఆందోళనకు దిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఆసుపత్రి 'ఆక్సిజన్​ డ్రిల్​'- రోగుల ప్రాణాలతో చెలగాటం

అనుమతులకు మించి కొవిడ్​ రోగులను చేర్చుకున్న ఓ ఆసుపత్రి.. ఆక్సిజన్​ కొరత ఎదురవడం వల్ల వారిని పంపించేందుకు ఓ 'ప్రణాళిక' రచించింది. వారికి ఆక్సిజన్​ సరఫరాను కొద్దిసేపు నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఆసుపత్రి యజమానే చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • అమానవీయం: నవజాత శిశువు శవాన్ని అలా..

ఉత్తర్​ప్రదేశ్​, కాన్పూర్​ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. నవజాత శిశువు శవాన్ని ఓ వీధికుక్క నోటకరుచుకుని జనావాసాల్లోకి తీసుకువచ్చింది. జిల్లాలోని భద్రస్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • తండ్రిని వెలేసిన 'కులం'- అన్నీ తామైన కుమార్తెలు

సామాజిక రుగ్మతలు చచ్చిన శవాన్ని కూడా పీడిస్తున్నాయి. సామాజిక బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏ ఒక్క గ్రామస్థుడూ ముందుకు రాలేదు. దీంతో ఆయన కూతుళ్లే అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • టీకా తీసుకుంటే ఎఫ్​డీపై అధిక వడ్డీ!

ప్రజల్లో కరోనా వ్యాక్సిన్​పై అవగాహన పెంచడం, టీకా తీసుకునేలా వారిని ప్రోత్సహించడం కోసం పలు బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. టీకా తీసుకున్న వారికి డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు చెల్లించనున్నట్లు తెలిపాయి. ఆఫర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • జాతి వివక్ష: మరో క్రికెటర్​ సస్పెండ్​ కానున్నాడా?

వివాదాస్పద ట్వీట్లపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద చేపట్టిన విచారణలో భాగంగా ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు మరో ఆటగాడిని విచారించిందని సమాచారం. అయితే అతడు ఎవరనేది తెలియలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • Seher Aly Latif: సినీ పరిశ్రమలో విషాదం

ప్రముఖ కాస్టింగ్​ డైరెక్టర్​, నిర్మాత సెహర్​ అలీ లతీఫ్(Seher Aly Latif)​ మరణించారు. మూత్రపిండాల వైఫల్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. సోమవారం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details