ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM

TOP NEWS @3 PM
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : May 26, 2021, 3:00 PM IST

  • 'కేసులు తగ్గుతున్నాయ్​.. కొన్ని జిల్లాల్లో ఇంకా మెరుగుపడాలి'
    రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్నాయని సీఎం జగన్​ అన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నియంత్రణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!
    కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. పరిశోధనలు జరిగేవరకు ఆపాలన్న ఆదేశాలతో ఔషధ పంపిణి నిలిచిపోయింది. అయితే.. ఆనందయ్యతో పాటు.. ఆయన శిష్యులు రహస్యంగా ఔషధాన్ని తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వదలం: అచ్చెన్నాయుడు
    కరోనా విపత్కర పరిస్థితుల్లో కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సోనూసూద్​పై అభిమానం.. అద్దంలో చూస్తూ ఉదరంపై చిత్రలేఖనం!
    చిత్రకారులు చేతితో.. కాలితో.. లేదా నాలుకతో ఇలా రకరకాల ప్రయత్నాల్లో అద్భుతమైన ప్రతిభ చాటినవాళ్లు.. ఎందరో ఉన్నారు. కానీ.. అద్దంలో చిత్రాన్ని చూస్తూ.. తన పొట్టపై చిత్రలేఖనం చేసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ
    బిహార్​లో బంకా జిల్లాలోని ఓ ధర్మాకాంటాపై దుండగులు దాడి చేశారు. ధర్మాకాంటాలో బాంబులు వేసి.. కాల్పులు జరిపి రూ.11 లక్షలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బుద్ధుని బోధనలు నేటికీ ఆచరణీయం: దలైలామా
    బుద్ధుని బోధనలు ప్రస్తుత పరిస్థితులకూ సరిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. బుద్ధుని జననం, జ్ఞానోదయానికి ప్రతీక అయిన బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈఫిల్​ టవర్​కు సరికొత్త వెలుగులు
    చరిత్రలో మొదటిసారిగా పారిస్​లోని ప్రఖ్యాత ఈఫిల్​ టవర్​.. సరికొత్త వెలుగులతో ప్రకాశించింది. పునురుత్పాదక హైడ్రోజన్​ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్​ సాయంతో ఇక్కడి దీపాలను మంగళవారం వెలిగించటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఏటా 200 కోట్ల డోసుల తయారీకి సిద్ధం'
    దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన వాక్‌హార్డ్‌ కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఏటా 200 కోట్ల టీకా డోసుల్ని తయారు చేయగల సామర్థ్యం తమకు ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • డబ్ల్యూటీసీ ఫైనల్:​ డ్రా అయితే ఫలితం ఎలా?
    మరి కొద్ది రోజుల్లో ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ప్రారంభంకానుంది. ఇందులో న్యూజిలాండ్​, టీమ్​ఇండియా తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్​ డ్రా అయితే? ప్రస్తుతం అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హాలీవుడ్​కు ప్రభాస్​.. వార్తల్లో నిజమెంత?
    యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్ హాలీవుడ్​లో నటించనున్నాడంటూ వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. 'మిషన్ ఇంపాజిబుల్'​లో డార్లింగ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించాడు దర్శకుడు మెక్​క్వారీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details