- పంచాయతీ పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 62.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదు: మంత్రి ముత్తంశెట్టి
మన పూర్వీకుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల తెలిపారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, దాడులు వంటి పలు అంశాలను వివరించినట్టు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- తెలంగాణలో వైఎస్ లేని లోటు కనిపిస్తోంది: షర్మిల
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోటస్పాండ్లో అభిమానులు, వైకాపా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- జోరుగా ఆపరేషన్ ఉత్తరాఖండ్: అమిత్ షా
ఉత్తరాఖండ్ విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం వరద ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. ఐటీబీపీ, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా: ఆజాద్