ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @1PM - ap top ten news

AP TOP NEWS : ప్రధాన వార్తలు @1PM

TOP NEWS @1PM
ప్రధాన వార్తలు @1PM

By

Published : Feb 17, 2022, 12:58 PM IST

  • ఏపీ, తెలంగాణ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ

AP- Telangana bifurcation Issues Subcommittee Meet : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ​ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం... తొలిసారిగా ఇవాళ భేటీ అయింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ సమావేశానికి.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్ హాజరయ్యారు. ఇవాళ ఉదయం11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ ప్రారంభమైంది.

  • శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి... వెయ్యి కోట్లతో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్

Electro Steel Casting: శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రూ. వెయ్యి కోట్లతో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ విస్తరణ ప్రణాళిక చేపట్టినట్లు పేర్కొంది. ఏడాదికి 0.5 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.

  • సినిమా టికెట్‌ ధరలపై కాసేట్లో తుది నిర్ణయం..!

సచివాలయంలో సినిమా టికెట్ల ధరల కమిటీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

  • Minister Satyavathi's Father Passes Away: తెలంగాణ మంత్రి సత్యవతి రాఠోడ్​కు పితృవియోగం

Minister Satyavathi's Father Passes Away : తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న మంత్రి.. మేడారం పర్యటన నుంచి బయలుదేరారు.

  • 15వేల అడుగుల ఎత్తు, మోకాలి లోతు మంచులో పహారా

ఎముకలు కొరికే చలి.. ఆపై విపరీతమైన మంచు. అలాంటి కఠినమైన చోట భారత సైనికులు పహారా కాస్తున్నారు. ఉత్తరాఖండ్​ హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. హిమపాతం అధికంగా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుకు తావు లేకుండా సరిహద్దులో పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు ఐటీబీపీ జవాన్లు. 15 వేల అడుగుల ఎత్తులో.. బలమైన రోప్​లను ఆధారంగా చేసుకొని మోకాలి లోతు మంచులో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • SHOURYA: తెలుగు వ్యక్తికి పోలీస్​ శౌర్య పురస్కారం... ఎవరంటే..

SHOURYA: తెలుగు పోలీసు ఉన్నతాధికారికి పోలీసు శౌర్య పతకం వరించింది. విధి నిర్వహణలో ధైర్య సహసాలు ప్రదర్శించినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. ఇంతకీ ఆ అధికారి ఎవరంటే..

  • రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి.. ఆరేళ్ల కొడుకునీ లాక్కెళ్లి...

Father suicide running train: ఆరేళ్ల కొడుకుతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు ఓ వ్యక్తి. బాలుడు ప్రాణాలతో బయటపడగా.. అతడి తండ్రి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.

  • 'ఉక్రెయిన్ సరిహద్దుకు మరిన్ని బలగాలు.. ఏ క్షణమైనా రష్యా దాడి'

Russia Ukraine tensions: ఉక్రెయిన్‌పై ఏ క్షణమైన రష్యా దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. రసాయన ఆయుధాలు లేదా తమ సైనికులపై దాడిచేశారనే తప్పుడు ఆరోపణలతో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగవచ్చని శ్వేతసౌధం తెలిపింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టేందుకు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగే సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు, విదేశాంగ మంత్రిని అగ్రరాజ్యం పంపనుంది. మరోవైపు తూర్పు ఐరోపాకు మరిన్ని బలగాలను నాటో తరలిస్తోంది.

  • ind vs wi first t20 rohith shama: 'శ్రేయస్​ను అందుకే తుది జట్టులోకి తీసుకోలేదు'

IND VS WI first T20 Rohith sharma: వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో విజయంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఈ గెలుపు తమ జట్టులో మరింత ధైర్యాన్ని నింపిందని చెప్పాడు. రవిబిష్ణోయ్​ ప్రతిభావంతుడని, అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. తుదిజట్టులోకి శ్రేయస్​ అయ్యర్​ను ఎందుకు తీసుకోలేదో వివరించాడు.

  • పూజాహెగ్డే కొత్త సినిమా.. మరోసారి చైతూతో కలిసి!

Nagachaitanya pooja hegdey: దర్శకుడు వెంకట్​ ప్రభు-నాగచైతన్య కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్​గా పూజాహెగ్డేను ఎంపిక చేసే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ABOUT THE AUTHOR

...view details