- త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే 3 రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయజెండా ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ధవళేశ్వరం వద్ద కాసేపట్లో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుండెల్లోనే కాదు.. గుడిపైనా పదిలమే
స్వాతంత్ర్య సమరయోధులు.. వారి వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే వారి త్యాగాల ఫలమే. వారందించిన సేవలను స్మరించుకుంటూ.. వారికి గౌరవాన్నిస్తూ.. రోడ్లపక్కన, పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వారి విగ్రహాలను పెట్టుకున్నాం. సంవత్సరానికోసారి జాతీయజెండాను ఎగురవేస్తూ.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగని కరోనా ఉద్ధృతి.. 50 వేలకు చేరువలో మరణాలు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ప్రపంచంలోనే అత్యధికంగా రోజువారీ సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 65 వేల మందికిపైగా వైరస్ సోకింది. మరో 996 మంది ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇంకా విషమంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి'
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇప్పటికీ వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం!