- ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆగివున్న కూలీల ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మన టీచర్‌కు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందనలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉపాధ్యాయురాలిని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏటా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి... ఎలా సిద్ధపడాలో తెలిపే వీడియోను ఆమె తయారు చేయడంపై ఈ ఘనత సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'
విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని తెదేపా అధినేతపై విమర్శలు సంధించారు. పార్టీలో వచ్చిన విభేదాలను చక్కదిద్దుకోవాలని చంద్రబాబుకు సూచించారు. గుంటూరు, విజయవాడలో వైకాపానే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. ప్రజలకు పవన్ వీడియో సందేశం
పంచాయతీ ఎన్నికల్లో బీభత్సం సృష్టించిన వైకాపాకు ఓటేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని.. ప్రజాస్వామ్యబద్ధంగా వారిపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్
మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి మిజోరంలో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను అప్పగించాలని భారత్‌ను ఆ దేశం కోరింది. ఈ మేరకు చాంపాయ్ జిల్లా డిప్యూటి కమిషనర్‌కు మయన్మార్ అధికారి ఒకరు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు