- Ports: ఓడరేవుల నిర్మాణ రుణాలకు ప్రభుత్వ పూచీ: మంత్రివర్గ భేటీలో నిర్ణయం
Cabinet decision: ఓడరేవుల నిర్మాణ రుణాల కోసం బ్యాంకులకు ప్రభుత్వం పూచీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. బెంగళూరు-కడప, కడప-విశాఖ మధ్య 3 విమాన సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు తితిదే ప్రత్యేక ఆహ్వానితుల బిల్లును ఆమోదించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణాయాలు తీసుకుంది.
- Maoists Letter : 'బాక్సైట్ తవ్వకాలు ఆపండి లేదా మన్యం విడిచి వెళ్లండి..లేదంటే'
Mavos Letter on Bauxite: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మావోయిస్టులు హెచ్చరించారు. అక్రమ తవ్వకాలను విద్యార్థి, ప్రజాసంఘాలు అడ్డుకోవాలని సీపీఐ మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది. 'అక్రమ తవ్వకాలు ఆపండి లేదా మన్యం వదిలిపొండి' అని హెచ్చరించారు. లేదంటే గతంలో ఎమ్మెల్యేలకు పట్టిన గతే పడుతుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
- Robbery at Nadikudi Junction: నడికుడి రైల్వేస్టేషన్లో దోపిడీ..రూ.89 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Theft at Nadikude Jn: నడికూడి రైల్వే జంక్షన్లో దోపిడీ జరిగింది. రైలు ఎక్కేందుకు సిద్దంగా ఉన్న ప్రయాణికులపై దాడి చేసి.. రూ.89 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- దేశంలో 662 రోజుల కనిష్ఠానికి కరోనా కేసులు
Covid Cases in India: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 3,993 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,71,308కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 12,08,581 కొత్త కేసులు వెలుగుచూశాయి.
- పసికందు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం
కేరళలోని తిరువనంతపురమ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి 8 నెలల బాలుడు సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు.
- షూటింగ్ లొకేషన్లోనే యువ డైరెక్టర్ అరెస్ట్- రేప్ ఆరోపణలతో...
Film Director Arrested: అత్యాచారం కేసులో.. మలయాళ సినిమా డైరెక్టర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. షూటింగ్ లొకేషన్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
- ఉక్రెయిన్‌లో దుర్భర పరిస్థితి.. చర్యలు అవసరం: భారత్
UNSC meeting on Ukraine: ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస భద్రతా మండలిలో ఆందోళన వ్యక్తం చేసింది భారత్. ఆ దేశంలోని భారతీయులతో పాటు మిగతా పౌరులను సురక్షితంగా తరలించాలని డిమాండ్ చేసింది. దాడులకు ముగింపు పలికి, చర్చలకు ఇరు దేశాలు తిరిగి రావాలని పునరుద్ఘాటించింది.
- స్కూల్ పిల్లలపై పైశాచికం.. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి
US School Shootings: అమెరికాలోని ఐవా రాష్ట్రంలో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. పాఠశాల ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- Stock market Live: ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 130 ప్లస్
ఒడుదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 52,974 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 15,890 వద్ద ట్రేడవుతోంది.