ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ ​11AM

ప్రధాన వార్తలు @ ​11AM

TOP NEWS @11AM
ప్రధాన వార్తలు @ ​11AM

By

Published : May 22, 2021, 11:00 AM IST

  • స్విమ్స్​లో.. ఆక్సిజన్ సరఫరాకు మూడంచెల వ్యవస్థ
    తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా రోగులు అత్యంత బాధాకర రీతిలో చనిపోయారు. అలాంటి దారుణాలు మరోసారి జరగకుండా మిగిలిన ఆసుపత్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న యువ ఉద్యోగులు
    రెండోదశ కొవిడ్‌ కల్లోలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారు. గతంతో పోలిస్తే కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అధిక ధరలకు రెమ్​డెసివర్ ఇంజక్షన్లు..ఇద్దరు నిందితులు అరెస్టు
    రెమ్​డెసివర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తీవ్ర లక్షణాలు కనిపిస్తుంటే.. ఆలస్యం చేయొద్దు!
    కరోనా కల్లోల పరిస్థితుల్లో అన్నీ సందేహాలే..! స్వల్ప లక్షణాలే అనుకుని.. ఇంట్లోనే ఉండి మందులు వాడుతున్నా సరైన సమయంలో వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు
    వైట్ ఫంగస్ మరో రాష్ట్రంలోనూ వెలుగుచూసింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. బిహార్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జీవజాతులకు పెను ముప్పు!
    పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించి, సత్వరం జీవవైవిధ్యాన్ని కాపాడుకోకపోతే 2050 నాటికి ఊహకందని విపరీత పరిణామాలెన్నో చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా
    భారత్​, పాకిస్థాన్​ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఈ రెండు దేశాలపై ప్రయాణాల నిషేధం విధించటం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వచ్చే నెల నుంచి కొత్త కార్ల సందడి షురూ!
    కరోనా రెండో దశ వల్ల ఆటో మొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా మార్కెట్లోకి కొత్త మోడళ్ల విడుదల ఆగిపోయింది. ఈ కారణంగా రాష్ట్రాల్లో లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తేసిన వెంటనే తమ కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి పలు కంపెనీలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండు జట్లతో టీమ్ఇండియా ప్రయోగం.. కొత్తేం కాదు!
    ఒకేసారి రెండు వేర్వేరు సిరీస్​ల కోసం వేర్వేరు జట్లను పంపించడం టీమ్​ఇండియాకు కొత్తేం కాదు. త్వరలో శ్రీలంక, ఇంగ్లాండ్​కు పర్యటనకు ఇలాగే రెండు జట్లు వెళ్లనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బీఏ రాజు హఠాన్మరణం.. సినీ ప్రముఖుల భావోద్వేగం
    ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. దీంతో ఆయన మృతి పట్ల చిరంజీవి, ప్రభాస్​, మహేశ్​ బాబు, ఎన్టీఆర్​ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details