- విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమతిపై అయోమయం!
విశాఖ తీరం నుంచి అమోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడడం లేదు. ఇప్పటికే 3 నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈ ఆఖరు వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు... అమోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజి చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్‌ఓసీని పోలీసులు రద్దుచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి
అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన సదాశివరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణం కోసం సదాశివరావు 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- లిబియాలో శ్రీకాకుళం యువకులు అదృశ్యం
ఉపాధి కోసం లిబియా దేశానికి వెళ్లిన ముగ్గురు శ్రీకాకుళం జిల్లా యువకులు అదృశ్యమయ్యారు. వీసా గడువు ముగిసి స్వదేశానికి వస్తున్న క్రమంలో వీరి ఆచూకీ తెలియకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దొడ్డిలో తెదేపా వర్గీయుడిపై వైకాపా కార్యకర్త దాడి
కర్నూలు జిల్లా దొడ్డిలో తెదేపా వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. అందుకోసం కుట్రదారులకు రూ.1.61 కోట్లు అందాయని వెల్లడించారు. దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇటీవల 15 మందిపై అభియోగపత్రం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు