- Chandrababu: 'దాడులకు భయపడం.. మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు తీరును తప్పుబట్టారు. తప్పు జరగకుంటే.. తమ పార్టీ నిజ నిర్ధరణ బృందాన్ని ఎందుకు కొండపల్లికి వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా కుటుంబీకులను పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Tdp Fact Finding comity: నేడు కొండపల్లికి తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. నేతల హౌజ్ అరెస్ట్
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. మొత్తం 10 మంది సభ్యుల కమిటీలో.. ఇప్పటికే పోలీసులు 8 మందిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయంలో 10 గేట్లను... 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉప్పొంగుతున్న నది- నిచ్చెన వేసి ప్రాణాలు కాపాడిన సిబ్బంది
హిమాచల్ ప్రదేశ్లో భీకర వర్షాలు కరుస్తున్నాయి. లాహౌల్ స్పీతి ప్రాంతంలో జహల్మన్ కాలువ ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ఈ కాలువపై వంతెన కూలిపోగా.. ఓ గాయపడ్డ వ్యక్తిని కాలువ దాటించేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కాలువపై ఓ నిచ్చెన ఏర్పాటు చేసి, తాడు సాయంతో కాలువ దాటించి, కేలాంగ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- సరిహద్దులో పాక్ చొరబాటుదారుల హతం
ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. పంజాబ్లోని తర్న్ తరణ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన జరిగిందని ఓ అధికారి శనివారం తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా ఆర్మీలోకి టిబెట్ యువకులు