- Anandayya medicine: అనంతపురంలో ఆనందయ్య మందు పంపిణీ
ఆనందయ్య మందును అనంతపురంలో గోవిందానంద స్వామీజీ బృందం పంపిణీ చేసింది. నగరంలోని 44వ డివిజన్లో దాదాపు 500 కుటుంబాలకు పైగా మందును వితరణ చేసినట్లు స్వామీజీ తెలిపారు. మందుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరంపై ఫిర్యాదు!
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేతకు అనుమతించడం దారుణం'
విశాఖ నగరంలో విభిన్న ప్రతిభావంతులకు లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేతకు.. అధికారులు అనుమతించటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త బ్రాండ్లతో జగన్.. మద్యం మాఫియాకు తెరతీశారు: కొల్లు రవీంద్ర
అధికారంలోకి వస్తే మద్యపాన నిషధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని.. కానీ ఆయనే తన సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు తెరతీశారని తెదేపా నేత పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా నేతలే దగ్గరుండి బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid-19: వరుసగా రెండో రోజు లక్షలోపే కేసులు
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 92,596 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్ బారినపడి మరో 2219 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid: మూడో దశ సన్నద్ధతపై మోదీ సమీక్ష
కరోనా మూడో దశ సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీకి అమిత్ షా సహా కీలక నేతలు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Mehul Choksi: కిడ్నాప్‌పై ప్రియురాలి సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కిడ్నాప్‌లో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది అతడి ప్రియురాలిగా భావిస్తున్న బార్బరా జబరికా. అనవసరంగా తనను ఇరికిస్తున్నారని, అతనితో స్నేహం మాత్రమే కోరుకున్నానని తెలిపింది. క్యూబా పారిపోవాలని చోక్సీ ప్రణాళిక వేసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భూమిపై మహా కృత్రిమ సూర్యుడు!
'కృత్రిమ సూర్యుడి'ని సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగా చైనా శాస్త్రవేత్తలు మరో విజయాన్ని సాధించారు. ఇటీవల 20 సెకండ్ల పాటు రికార్డు స్థాయిలో 16కోట్ల డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతను సృష్టించించారు. ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) పరికరం ద్వారా ఇది సాధ్యమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- WTC: అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. రికార్డే!
దాదాపు రెండున్నరేళ్ల నుంచి సాగుతున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ బ్యాట్స్‌మెన్‌కు ధీటుగా పలువురు బౌలర్లు సత్తా చాటారు. వికెట్లు వేటలో తామేం తక్కువ కాదని నిరూపించారు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అశ్విన్.. ఈ టోర్నీలో అరుదైన ఘనత సాధించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఇంతకీ అదేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- The Family Man 2: సమంత రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్లో రాజీ పాత్రలో సమంత అద్భుతంగా నటించి, మెప్పించింది. అయితే ఇందుకోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆమెకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారంటే?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.