ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఆంధ్రప్రదేశ్ అప్ డేట్స్

ప్రధాన వార్తలు @ 1 PM

Top News @ 1 PM
Top News @ 1 PM

By

Published : Aug 24, 2020, 1:01 PM IST

  • సారథిగా తప్పుకుంటా: సోనియాగాంధీ

కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు సోనియా గాంధీనే పదవిలో కొనసాగాలని భేటీలో మన్మోహన్​ సింగ్​, ఏకే ఆంటోనీ కోరారు. మరోవైపు.. తాను సారథిగా తప్పుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలకు సోనియా చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలి: శైలజానాథ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వ మార్పుపై అధినేత్రికి ఆయన లేఖ రాశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు సోనియా చేసిన కృషి మరవలేనిదని ప్రశంసించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • తొట్లకొండ భద్రత పట్ల బౌద్ధ సంఘాల్లో ఆందోళన

వేల ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన విశాఖలోని తొట్లకొండ భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే అక్కడ నిర్మాణాలు తలపెట్టడం సరికాదని బౌద్ధ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. తొట్లకొండ చారిత్రక విలువ, పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దని కోరుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వెంటిలేటర్​పైనే ప్రణబ్: ఆర్మీ ఆస్పత్రి ప్రకటన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్​పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అలా జరిగితే సైనిక చర్యే: చైనాకు రావత్ హెచ్చరిక

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​. చర్చలు విఫలమైతే.. చైనా అతిక్రమణలను సైనిక చర్యలతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అరుణాచల్​​ప్రదేశ్​, మహరాష్ట్రలో భూప్రకంపనలు

అరుణాచల్​ప్రదేశ్​ అన్జు జిల్లాలో భూమి స్వలంగా కంపించింది. రిక్టర్​ స్కేల్​పై 3.7 తీవ్రతగా నమోదైందని భూకంప కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నెలలో భూకంపం సంభవించటం ఇది రెండోసారి కావటం గమనార్హం. మరోవైపు మహారాష్ట్ర పాల్​ఘర్​ జిల్లాలో ఆదివారం నాలుగు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధం :బైడెన్​

డెమెుక్రాటిక్​ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన జో బైడెన్​ రెండుసార్లు అగ్రరాజ్య అధ్యక్షుడిగా పరిపాలన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తన వయస్సు, ఆరోగ్య పరిస్థితిపై ఎన్నికల ప్రచారంలో ట్రంప్​ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ అధ్యక్షుడి రాజీనామా కోసం దేశవ్యాప్త నిరసనలు

బెలారస్​లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అలెగ్జాండర్​ లుకాషింకో.. తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. 20 వేల మందికిపైగా పాల్గొన్న ఈ నిరసనలతో రాజధాని నగర వీధులు హోరెత్తాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆర్థిక షేర్ల దూకుడు- మార్కెట్లలో లాభాల జోరు

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లోనూ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా వృద్ధితో 38,685 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా బలపడి 11,446 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పీపీఈ కిట్లతో అమితాబ్ ​'కేబీసీ' షూటింగ్​ ప్రారంభం!

ప్రఖ్యాత టీవీ ​షో కేబీసీ 12వ ఎడిషన్​ షూటింగ్​ను ప్రారంభించారు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details