ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

.

TOP NEWS @ 1 PM
ప్రధాన వార్తలు @ 1pm

By

Published : Jul 1, 2020, 12:59 PM IST

  • సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలపై సంయుక్త కమిటీ
    తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ జరిగింది. ఇసుక తవ్వకాలు, రొయ్యల చెరువులపై విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. రాజోలు, అంతర్వేది, పలు ప్రాంతాల్లో ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీలో పిటిషన్ వేశారు. సముద్రానికి సమీపంలో అక్రమ రొయ్యల చెరువులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • విజయసాయిరెడ్డికి పుట్టినరోజు బహుమతి
    వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్​...108 స్కామ్​తో రూ.300 కోట్లు పుట్టినరోజు బహుమతి ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్​గా మారకుండా ఉండటానికి సీఎం జగన్​ ఆ మాత్రం సమర్పించుకోవాలని అయ్యన్న ఎద్దేవాచేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పీవీపీకి హైకోర్టులో స్వల్ప ఊరట
    వైకాపా నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్​కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. పీవీపీ ముందస్తు బెయిల్​పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • వాలంటీర్ ఆత్మహత్యాయత్నం
    ఇళ్ల స్థలాల్లో అవినీతి కారణంగా చిత్తూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పాపం పసివాళ్లు
    పాపం పసివాళ్లు.. ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థంకాదు.. ఏది తినొచ్చో.. ఏది తినకూడదో తెలియదు. చేతికి దొరికింది నోట్లో పెట్టుకుంటారు. అందుకే పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆ తల్లీ అప్పటివరకూ అలానే చూసుకుంది. అయితే ఎప్పుడు కన్నంటిందో తెలియదు. నిద్రలోకి జారుకుంది. లేచి చూసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. పసివాళ్లు తెలియక కూల్ డ్రింకులో చీమల మందు కలుపుకుని తాగేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • బాయిలర్​ పేలి ఐదుగురు మృతి
    తమిళనాడు కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్​ స్టేషన్​లో భారీ ప్రమాదం జరిగింది. ఎన్​ఎల్​సీ యూనిట్​-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • భారత బలగాలకు వాటర్​ప్రూఫ్ దుస్తులు!
    చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్వాన్​ లోయలో భారత బలగాలు ప్రత్యేకమైన వాటర్​ప్రూఫ్ దుస్తులను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా గల్వాన్​ నదిలో దిగేందుకు వీలుగా వీటి అవసరం చాలా ఉందని సైనిక వర్గాలు అంటున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • విమాన సంస్థలకు షాక్​
    గడిచిన 30 రోజుల్లో ఏటీఎఫ్​ ధరలు మూడోసారి పెరిగాయి. దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర బుధవారం 7.5 శాతం పెరిగి.. రూ.41,992.81కి చేరింది. రాయితీ లేని వంట గ్యాస్ ధరలను ఫ్లాట్​గా ఉంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఇంటర్నెట్​ ప్రశాంతంగా ఉంది'
    టిక్​టాక్​ నిషేధం గురించి మాట్లాడిన షూటర్ హీనా సిద్ధూ.. ఇప్పుడు ఇంటర్నెట్​ ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చింది. అసభ్యకర వీడియోలకు చెక్ పెట్టినట్లయిందని ట్వీట్ చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • రాజ్యమేలుతున్న వెబ్​సిరీస్​లు
    వెబ్​సిరీస్​ల ట్రెండ్​ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, లాక్​డౌన్​తో వచ్చిన విరామంలో వీటి క్రేజ్​ ఇంకా పెరిగింది. విజయవంతమైన పలు సిరీస్​లకు కొత్త సీజన్​లను విడుదల చేసే పనిలో ఉన్నారు సదరు దర్శక నిర్మాతలు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details