ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 9PM

.

top news 9pm
top news 9pm

By

Published : Aug 6, 2020, 9:00 PM IST

  • ఏపీపై కరోనా పంజా

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. 24 గంటల వ్యవధిలో 10,328 కేసులు నమోదయ్యాయి. 72 మంది మృతిచెందారు. 24 గంటల వ్యవధిలో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యారు. వారికి కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం తాడిపత్రికి బయలుదేరి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • భాజపా శత్రువుగా మారింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భాజపా శత్రువుగా మారిందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ రాజధానికి సాయం చేస్తానని హమీ ఇచ్చారని గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కరోనాతో శ్రీవారి ఆలయ అర్చకుడు మృతి

తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో కన్నుమూశారు. 4 రోజుల క్రితం కరోనాతో స్విమ్స్​లో చేరిన ఆయన... గురువారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసాచార్యులు మధుమేహంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్విమ్స్ వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించినా కాపాడలేకపోయామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ప్రధానికి ఆ ధైర్యం లేదు

తూర్పు లద్ధాఖ్​లో చైనా అతిక్రమణలపై రక్షణశాఖ అధికారిక వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేసిన పత్రాలను తొలగించటంపై కాంగ్రెస్​ ఘాటుగా స్పందించింది. పత్రాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు రాహుల్​ గాంధీ. ఆ ఫైల్స్​ డిలీట్ చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పని చేయని ప్లాస్మా చికిత్స

కరోనా సోకిన వారిపై ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తోందన్న వాదనలు కొట్టిపారేసింది దిల్లీ ఎయిమ్స్​. ఈ చికిత్స రోగులపై పెద్దగా ప్రభావం చూపటం లేదని స్పష్టం చేసింది. ఇటీవలి ఫలితాల ప్రాథమిక విశ్లేషణ చేసి ఈ మేరకు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • యూపీలో కరోనా తీవ్రరూపం

యూపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 4,658 మందికి వైరస్ సోకింది. దిల్లీ, కేరళలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కోటి 90 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్​ ఉగ్రరూపంతో బాధితుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 90 లక్షలు దాటింది. 7.11 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • వొడా-ఐడియాకు 25,560 కోట్లు నష్టం

టెలికాం దిగ్గజం వొడాఫోన్-ఐడియా 2020-21 క్యూ1లో రూ.25,460 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.10,659.3 కోట్లకు పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఫుట్​బాల్​ ట్రైనర్​ అవతారమెత్తిన తల్లి

కేరళ మలప్పురానికి చెందిన హజర అనే మహిళ.. తన కొడుకు కోసం ఫుట్​బాల్​ ట్రైనర్​ అవతారమెత్తింది. లాక్​డౌన్​తో నిలిచిపోయిన అతడి ఫుట్​బాల్​ శిక్షణను తిరిగి మొదలుపెట్టించి.. దగ్గరుండి శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'ములన్'

కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన హాలీవుడ్​ చిత్రం 'ములన్'ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం నిర్ణయించింది. సెప్టెంబరు 4న డిస్నీ ప్లస్​లో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వాల్ట్​ డిస్నీ ప్రకటించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details