- రేపే జగనన్న పచ్చతోరణం ప్రారంభం
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో.. గురువారం ఉదయం మొక్కనాటి జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ITDP: కార్యకర్తలకు రక్షణగా.. ఐటీడీపీ వెబ్సైట్ ప్రారంభం
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న తెదేపా కార్యకర్తలకు రక్షణగా నిలిచేందుకు ఐటీడీపీ వెబ్‌సైట్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించారు. పోస్టులపై పోలీసులు ఇబ్బంది పెట్టినా, వైకాపా చిల్లర గ్యాంగులు బెదిరించినా వాట్సప్ లింక్‌లో సమాచారం అందిస్తే అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జాతీయ నేతల మద్దతు
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలవరం ముంపు బాధితులు నిరసన చేపట్టారు. బాధితులకు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పోలవరం భూనిర్వాసితులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- viveka murder case: వివేకా హత్యకేసు.. సునీల్‌యాదవ్‌కు 14 రోజుల రిమాండ్
వివేకా హత్య కేసులో (Viveka murder case) అనుమానితుడైన సునీల్‌ను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో నిన్నటినుంచి సునీల్ యాదవ్‌ను ప్రశ్నించిన అధికారులు.. పులివెందల తీసుకెళ్లి అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సునీల్ యాదవ్‌కు 14 రోజుల పాటు పులివెందుల కోర్టు రిమాండ్ విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐదు బిల్లులకు ఆమోదం!
గందరగోళ పరిస్థితుల మధ్యే పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు కొనసాగాయి. విపక్షాల ఆందోళన నడుమ మూడు బిల్లులు రాజ్యసభ, రెండు బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. విపక్షాల తీరు పట్ట రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సభ సజావుగా జరగకపోవడానికి కారణం ప్రభుత్వమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రం క్లారిటీ