ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

.

Top News 9 PM
ప్రధాన వార్తలు@ 9pm

By

Published : Jul 8, 2020, 8:58 PM IST

  • శాఖల కేటాయింపులో సవరణలు

ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శులుగా ఉన్న అధికారులకు.. శాఖల్లో సవరణలు జరిగాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏపీ ప్రభుత్వ వాదన తిరస్కరణ

ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ పునర్‌నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి షాక్ కలిగేలా ధర్మాసనం స్పందించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్న

అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రిలో చేరారు. ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్‌లో అచ్చెన్నను పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొత్తగా 1062 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,062 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 22, 259కి చేరాయి. వైరస్ కారణంగా... మరో 12 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 264కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శాంతి స్థాపన దిశగా..

సరిహద్దులో భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఇరు దేశాల బలగాలు గల్వాన్​ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి 1.5కి.మీ మేర వెనక్కి వెళ్లాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరోసారి చర్చలు జరుపనున్నాయి రెండు దేశాలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కేబినెట్ ఆమోదం

కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పేదలకు ఉచిత రేషన్​ అందజేసే కార్యక్రమాన్ని నవంబరు వరకు పొడిగించింది కేంద్రం. రూ.15వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్​ భారాన్ని మరో 3 నెలల పాటు కేంద్రమే మోయనుంది. ఈ నిర్ణయాలకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పాక్ మరో కుట్ర!

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్ కుట్రలు పన్నుతోంది. మరణ శిక్షపై రివ్యూ పిటిషన్​ వేసేందుకు ఆయన నిరాకరించినట్లు చెబుతోంది. క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లేందుకు జాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పసిడి పైపైకి ...

బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 723 ఎగబాకింది. కిలో వెండి ధర రూ. 104 తగ్గింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆసియా కప్​-2020 రద్దు

సెప్టెంబర్​లో జరగాల్సిన ఆసియాకప్​ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​​ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీ రద్దుకు నిర్ణయించామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సీనియర్‌ నటికి తీవ్ర అస్వస్థత

ప్రముఖ సీనియర్​ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా నెగిటివ్​ అని తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details