- నేడు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ వెబ్‌సైట్ ప్రారంభం
Jagananna smart town ship: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్వారీ అక్రమాలు ప్రశ్నించినందుకే.. వైకాపా దాడులు: చంద్రబాబు
CBN ON ATTACKS IN KUPPAM: వైకాపా నేతల క్వారీ అక్రమాలను ప్రశ్నిచినందుకే తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరుగుతున్న దాడులతో.. అక్కడ పోలీసుల వైఫల్యం తేటతెల్లమైందిని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మున్నేరులో గల్లంతైన విద్యార్థుల్లో ఐదు మృతదేహాలు లభ్యం
Childrens Missing: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో గల్లంతైన ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మున్నేరులో ఇసుక కోసం తవ్విన గుంతలో మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డ్రిప్ కింద మూడు ప్రాజెక్టులకు చోటు..త్వరలో మరమ్మతులు!
DRIP Programme: కేంద్ర జలశక్తిశాఖ అమలు చేస్తున్న డ్యాం రీహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు చోటు దక్కింది. డ్రిప్ కింద శ్రీశైలం, ధవళేశ్వరం, రైవాడ ప్రాజెక్టులకు మరమ్మతులు చేసే అవకాశం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తరగతుల విలీనంతో.. విద్యార్థులకు బడి దూరం.. చదువు భారం
CLASSES MERGING EFFECT: ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5తరగతుల విలీన ప్రక్రియను.. పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది. దీంతో విద్యార్థులకు బడి దూరం పెరగనుంది. తొలుత విడతలవారీగా విలీనం చేయాలని భావించినా.. ఇటీవల సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో.. ఒకేసారి 3 కిలోమీటర్ల దూరానికి సంబంధించిన మ్యాపింగ్‌ను పూర్తి చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశ రాజకీయాల్లో 'టెక్ ఫాగ్' కలకలం..
Tek Fog app: భాజపాకు చెందిన టెక్ ఫాగ్ యాప్‌పై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దీని ద్వారా కమలం పార్టీ సామాజిక మాధ్యమాలను హైజాక్ చేస్తోందని ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఉటంకిస్తూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దేశ భద్రతకు ఈ యాప్ పెను ముప్పు అని ఆరోపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మన చదువుల్ని కాపీ కొట్టి... మనను ఏమార్చి
Azadi ka amrit mahotsav: అనాగరికులమని, చదువులు తెలియనివాళ్లమని మనల్ని గేలిచేసిన ఆంగ్లేయులు... మన విద్యా విధానాన్ని కాపీ కొట్టారంటే ఈతరంలో చాలామంది నమ్మరు! కానీ అది నిజం! మన సొమ్మును, కోహినూర్‌లాంటి వజ్రాలను కొల్లగొట్టడమేకాదు.. మన విద్యావిధానాన్నీ కాపీకొట్టారు ఆంగ్లేయులు! భారతీయ పురాతన సంప్రదాయ విద్యావిధానం పుణ్యమా అని బ్రిటన్‌లో చదువులు చకచకా పరుగందుకుంటే... మెకాలే తోక పట్టుకుని ఈదటం మొదలెట్టిన మనం తిరోగమనంలోకి పయనించాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నేరం నేను చేయకపోయినా కించపరుస్తున్నారు'
Bhavana Menon news: ప్రాణాలతో బయట పడటం నుంచి బాధితురాలిగా కొనసాగడం వరకు.. అంత తేలికైన ప్రయాణం కాదని కథానాయిక భావన పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఆమెను అపహరించి, దాడి ఉదంతం, తదనంతర పరిణామాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తన అంతరంగాన్ని బయటపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు..
IND VS SA 3rd Test: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు మంగళవారం నుంచి జరగనుంది. సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరు జట్లు.. చివరి మ్యాచ్‌లో గెలుపుపై వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మూడో మ్యాచ్‌లో గెలిచి.. దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన పరితపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.