ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM
Top News 7 PM

By

Published : Sep 2, 2020, 6:59 PM IST

  • ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు

నేడు కూడా రాష్ట్రంలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా నివేదిక ప్రకారం.. మరో 10 వేల 392 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 4 లక్షల 55 వేల 531కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 4,125 కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సీఎం గారూ.. కరోనాపై కాస్త స్థాయికి మించి ఆలోచించండి: చంద్రబాబు

సీఎం జగన్ పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ స్థాయికి మించి ఆలోచన చేస్తే బాగుంటుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దేశంలో కరోనా కేసుల ప్రవాహంలో.. రాష్ట్రం రెండవ స్థానంలో ఉండటం ప్రభుత్వం వైఫల్యాలకు నిదర్శనమన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

రైతులకు ఉచిత విద్యుత్‌పై మంత్రి బాలినేని స్పందించారు. రాష్ట్రంలో రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సంస్కరణల్లో భాగంగానే.. ఈ నిర్ణయమని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'నేను చనిపోవడానికి ఆమెనే కారణం'

రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు చనిపోవడానికి ఆమే కారణమంటూ సెల్ఫీవీడియో తీసుకుని పురుగు మందు తాగాడు. ఇంతకీ వాళ్లిద్దరి మధ్య ఏమైనట్టు.. అంతలా ఇష్టపడి చేసుకున్న వ్యక్తిని, పుట్టిన పాపను వదిలి ఎందుకు చనిపోయాడు? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రశ్నోత్తరాల రద్దుపై ప్రతిపక్షాల మండిపాటు

పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. కరోనా సాకు చెప్పి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ధ్వజమెత్తాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పబ్​జీ సహా 118 చైనా యాప్స్​పై నిషేధం

ఊహాగానాలను నిజం చేస్తూ.. ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​ పబ్​జీని భారత ప్రభుత్వ నిషేధించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం 118 చైనా యాప్స్​ను బుధవారం బ్యాన్​ చేసింది. భారత సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతకు విరుద్ధంగా ఈ యాప్స్​ కార్యకలాపాలు సాగిస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చైనాకు సొంత కమాండరే షాకిచ్చారు: అమెరికా

పాంగాంగ్​ ఘటనకు సంబంధించి భారత్​ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని అమెరికా అభిప్రాయపడింది. అయితే, భారత్​ దీటుగా చైనాను అడ్డుకుందని తెలిపింది. పాంగాంగ్​లో భారత్​తో వాగ్వివాదం సమయంలో​ చైనా నాయకత్వాన్ని సంప్రదించకుండానే.. పీఎల్​ఏ కమాండర్​ వెనక్కి తగ్గి బీజింగ్​కు షాకిచ్చినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ చిప్స్​​​ కొంటే.. 2 జీబీ డేటా ఉచితం

ఇకపై లేస్​, కుర్కురే, అంకుల్​ చిప్స్​ ప్యాకెట్లను కొన్న వారికి 2 జీబీ డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్​టెల్​. ఇందుకోసం పెప్సికో, ఎయిర్​టెల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రూ.10 లేస్​ ప్యాకెట్​ కొన్న వారికి 1 జీబీ డేటా, రూ.20 ప్యాకెట్​కు 2జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐపీఎల్ మరో​ అధికారిక భాగస్వామిగా 'క్రెడ్​'

ఈ ఏడాది ఐపీఎల్​కు ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్‌' (సీఆర్‌ఈడీ)ని రెండో అధికారిక భాగస్వామిగా ప్రకటించింది బీసీసీఐ. ఇటీవల 'అన్​అకాడమీ' సంస్థను ఓ భాగస్వామిగా ఎంపిక చేసింది బోర్డు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నిదానంగా కోలుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు

కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాలు ఆరోగ్య విషయమై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details