- సున్నా వడ్డీ పథకంపై బకాయిలను సున్నా చేస్తున్నాం: సీఎం
సున్నా వడ్డీ పథకం కింద నగదును ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం జగన్ చెప్పారు. 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. నాలుగైదు రోజులు ఆలస్యమైనా రైతులు కంగారుపడవద్దని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దగా దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని.. పార్టీ సీనియర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎస్ఈసీ కేసులో పూర్తి విచారణకు సిద్ధం కావాలని సుప్రీం చెప్పింది'
నిమ్మగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు... పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దేశ సర్వోన్నతన్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు.. తప్పుబట్టిన ఎంపీ
తనపై ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తనకు పరువునష్టం కలిగించాయని పేర్కొన్నారు. ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గుడ్ న్యూస్: ఆగస్టు వరకు పీఎఫ్ భారం కేంద్రానిదే
కేంద్ర మంత్రివర్గం చిరుద్యోగులకు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉద్యోగి, యజమానుల ఈపీఎఫ్ భారాన్ని (12+12 శాతం)... గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కేంద్రమే భరించే ప్రతిపాదనను ఆమోదించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు'