ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS 5 PM ఏపీ ప్రధాన వార్తలు - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

.

TOP NEWS  5 PM
PM ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Aug 31, 2022, 5:03 PM IST

  • ఏఆర్​ కానిస్టేబుల్​ భానుప్రకాష్​ వివాదం.. ఎస్పీ ఫక్కీరప్పతో పాటు మరో ముగ్గురిపై కేసు
    AR Constable Bhanu Prakash Issue: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పతో పాటుగా మరో ముగ్గురు పోలీసులపై కేసు నమోదైంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తొలగించారని అనంతపురంలోని టూ టౌన్​లో ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. కలెక్టరేట్‌ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన: ఏపీఎన్జీవో
    APNGO PROTEST ON SEPTEMBER 1ST: ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీఎన్జీవో ప్రకటించింది. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్టు చేయటం అన్యాయమని మండిపడింది. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెన్నా నదికి పోటెత్తిన వరద.. ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు
    PENNA RIVER WATER FLOW: ఎగువున కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని పెన్నా నదికి వరద పోటెత్తింది. పేరూరు సమీపంలో ఉన్న అప్పర్ ప్రాజెక్ట్ ఐదు గేట్లను అధికారులు తెరిచారు. ధర్మవరం-కళ్యాణదుర్గం మధ్య నూతిమడుగు సమీపంలోని కాజ్​వే దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • 115 kg Silver Ganesh: గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడికి పూజలు
    Silver Ganesha in Limca Book of Records: అనంతపురం జిల్లా గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడిని ఘనంగా ఊరేగించారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించిన ఈ గణనాథుడిని చవితి వేళ పల్లకిలో ఊరేగించడం ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా 22 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, 115 కిలోల వెండి వినాయకుడికి దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశుడు.. గవర్నర్‌ తమిళిసై తొలిపూజ
    Governor Tamilisai visited Khairatabad Ganesh: తెలంగాణ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద కోలాహలం నెలకొంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలు అరెస్ట్​
    Seema Patra BJP : తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిమనిషి శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫైనల్‌కు చేరిన బ్రిటన్‌ ప్రధాని రేసు.. పగలు, రాత్రి పనిచేస్తానన్న సునాక్‌
    దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్​ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు పనిచేస్తానని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం తాను పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇకపై దిల్లీ, కోల్​కతా నుంచి హైదరాబాద్​కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్
    Zomato Intercity legends : ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సర్వీసుల్ని పరిచయం చేసింది. వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన ఆహారాన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్​ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గణేష్​ చతుర్థి విషెస్​తో మనసు దోచేసిన వార్నర్​
    దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్‌ విగ్రహాలను ఏర్పాట చేసుకుని పూజాపురస్కారాలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్​ వార్నర్​ పెట్టిన పోస్ట్ మాత్రం​ వైరల్​గా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • Filmfare awards 2022.. ఉత్తమ నటులుగా రణ్​వీర్​, కృతి
    Filmfare awards 2022 winners ముంబయిలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్య‌క్ర‌మం. 2022 సంవ‌త్స‌రానికి గాను ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్​వీర్​ సింగ్, ఉత్త‌మ న‌టిగా కృతి స‌న‌న్​ అవార్డులను స్వీక‌రించారు. ఇంకా ఎవరెవరంటే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details