ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm - ఏపీ వార్తలు

.

Top News 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jul 8, 2020, 5:00 PM IST

  • ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దగా దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని.. పార్టీ సీనియర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • దృష్టి మరల్చేందుకే విగ్రహ స్థాపన

దళితులను వివిధ రకాలుగా వేధించి.. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం పేరుతో వైకాపా ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. దళితులపై దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు విగ్రహ స్థాపన అంటూ డ్రామాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వచ్చే వారానికి వాయిదా

ఈఎస్​ఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • చర్చలకు బ్రేక్

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు బస్సులు తిప్పితే కేసులు పెరుగుతాయనే సూచనలు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని... ఛార్జీలు పదిరెట్లు పెంచినా ఆర్టీసీకి నష్టాలు తీరవన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • మరో కయ్యం

ఇటీవలి కాలంతో తరచుగా భారత్​తో సరిహద్దు వివాదానికి కాలుదువ్వుతున్న నేపాల్... మరోసారి దుందుడుకుగా వ్యవహరించింది. బిర్గుంజ్​ - రక్సాల్ ప్రాంతాలను కలిపే ఓ వంతెనపై బోర్డు ఏర్పాటు చేసి, ఇది తన భూభాగానికి చెందుతుందని పేర్కొంది. అయితే ఎస్​ఎస్​బీ దళాల రంగ ప్రవేశంతో వెనక్కి తగ్గిన నేపాల్.. వంతెనపై ఏర్పాటు చేసిన బోర్డును తొలగించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?

విరాళాల సేకరణలో రాజీవ్​ గాంధీ ఫౌండేషన్ చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారణకు ఆదేశించింది కేంద్రం. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్యను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించింది కాంగ్రెస్​. భాజపా మాత్రం ఈ విమర్శల్ని తోసిపుచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కొత్త లాజిస్టిక్స్​ చట్టం

దేశంలో వాణిజ్యం సాఫీగా జరగాలంటే సరకు రవాణా చాలా కీలకం. లాజిస్టిక్ వ్యవస్థ అసమర్థంగా ఉంటే రవాణా వ్యయాలు పెరిగిపోతాయి. ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • హైకోర్ట్​ గ్రీన్​ సిగ్నల్​!

పాకిస్థాన్​లో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరును అడ్డుకోలేమని స్పష్టం చేసింది ఇస్లామాబాద్​ హైకోర్టు. దేవాలయ నిర్మాణంపై దాఖలైన మూడు పిటిషన్లను కొట్టివేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • తూకం వేసి తింటున్న కెప్టెన్

తన భర్త కోహ్లీ, ఇంట్లోని ఆహారాన్ని తూకం వేసి తింటాడని చెప్పుకొచ్చింది హీరోయిన్​ అనుష్క శర్మ. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు, తెగ కామెంట్లు పెడుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'నాకు రెండో ఇల్లు లాంటిది'

టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2020కు ప్రచారకర్తగా ఎంపికైంది నటి ప్రియాంకా చోప్రా. దీనికి​ రానున్న కాలంలోనూ బ్రాండ్ అంబాసిడర్​గా కొనసాగాలని ఆకాంక్షించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details