- Letter to Vijayasaireddy: 'ఆ బాధ్యతలు వల్లభనేని వంశీకి వద్దు'
Letter to Vijayasaireddy: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దంటూ.. జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు లేఖ రాశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Kodali-Vangaveeti Meet: కొడాలి నాని, వంగవీటి రాధా భేటీ.. ఏం మాట్లాడుకున్నారు?
Kodali-vangaveeti meet: కొడాలి నాని, వంగవీటి రాధా.. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ఏదో ఒక సంచలనమే. తాజాగా వీరిద్దరూ.. కృష్ణా జిల్లాలో గుడివాడ మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బాబ్జీ అంతిమ యాత్రలో శనివారం నాడు కలుసుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. అసలు వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారోనని.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముగిసిన భరతముని నాట్యోత్సవాలు.. కళాకారులను సత్కరించిన నాట్యాచారులు
Bharatamuni Natyothsavalu: ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా.. కృష్ణా జిల్లా కూచిపూడిలో జరుగుతున్న భరతముని నాట్యోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో.. నాట్యప్రదర్శనలు చేసిన కళాకారులను నాట్యాచారులు సత్కరించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Mallu Swarajyam: రజాకార్ల పాలిట సింహస్వప్నం.. దొరల గుండెలపై తుపాకీ గురిపెట్టిన వీరవనిత!
Mallu Swarajyam: ఆమె ఓ భూస్వామి బిడ్డ. పెద్ద బంగళా.. పని మనుషులూ.. కోరుకున్నంత వైభోగం. కానీ ‘బాంచన్ దొరా’ బతుకులు ఆమెను కలచివేశాయి. ఆస్తిపాస్తులన్నీ వదులుకొని పోరుబాట పట్టారు. గడీలలో నిజాం పాలకుల అకృత్యాలకు నిరసనగా గళమెత్తారు. అసహాయులకు అండగా నిలిచేందుకు ఆయుధం పట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Goshala's: పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా గోశాలలు: తితిదే ఈవో జవహర్‌రెడ్డి
TTD EO on Goshala's: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోశాలను.. తితిదే ఈవో జవహర్‌రెడ్డి సందర్శించారు. గో సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. రాష్ట్రంలోని గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కుటీర పరిశ్రమ కేంద్రాలుగా రూపొందిస్తారమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యోగి ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. అతిథిగా మోదీ!
UP CM Yogi Adityanadh oath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈనెల 25వ తేదీన యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇకానా మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకే వ్యక్తికి 500 పాముకాట్లు.. ఎంతమందిలో ఉన్నా టార్గెట్ అతడే!
500 snake bites to a person: ఓ వ్యక్తికి పాము ఒకసారి, రెండు సార్లు కాటువేయడం సహజం. అలాంటిది గత పదిహేనేళ్లలో సుమారు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. అతనే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అనిల్ తుకారాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైపర్‌సోనిక్ ఎందుకింత డేంజర్.. భారత్‌లో ఈ మిసైల్ ఉందా?
Ukraine Russia war: ఉక్రెయిన్‌పై దాడుల్లో తొలిసారిగా కింజాల్ హైపర్‌సోనిక్ మిసైల్‌ను వాడింది రష్యా. ఈ క్షిపణితో ఉక్రెయిన్‌లోని ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనతో హైపర్‌సోనిక్ మిసైల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంతకీ హైపర్‌సోనిక్ అంటే ఏమిటి? ఈ అస్త్రం భారత్‌లో ఉందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Suresh Raina: రైనాకు ఆ దేశ ప్రతిష్ఠాత్మక అవార్డు
Suresh Raina: మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు ఎంపికయ్యాడు భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడగా.. రైనాను ఈ అవార్డు వరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్ ఫైల్స్ దూకుడు.. దంగల్ రికార్డులు బద్దలు.. బాహుబలికి చేరువగా..
The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం దూసుకుపోతోంది. విడుదలైన ఎనిమిదవ రోజు బాహుబలి 2కు చేరువగా వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది. దంగల్ కంటే ఎక్కువగానే వసూళ్లు చేసింది. 1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 11న విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.