- విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!
విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - పింఛన్ల పంపిణీలో అక్రమాలు.. 9 మంది గ్రామ వాలంటీర్లను తొలగింపు
విశాఖ జిల్లా కోటవురట్ల మండలం చౌడువాడలో 9 మంది గ్రామ వాలంటీర్లను తొలగించారు. పంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీలో అవకతవకలపై కలెక్టర్ మల్లిఖార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మంది గ్రామ వాలంటీర్లను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "పోలవరం ఆకృతుల విషయంలో నిర్ణయం.. అప్పుడే తీసుకుంటాం"
Polavaram structure: పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు సంబంధించిన అంశాల్లో.. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులంతా వచ్చి చూసిన తర్వాతే.. నిర్ణయం తీసుకుంటామని ఆ కమిటీ ఛైర్మన్ పాండ్యా తెలిపారు. డ్రిప్ కమిటీ పర్యటనలో భాగంగా పోలవరం సందర్శించిన పాండ్యా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే లో హైడ్రాలిక్ సిలిండర్లు ఎలా పని చేస్తున్నాయో చూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - శ్రీకాకుళం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..
కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరవడంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కానందుకు వారెంట్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 1.41లక్షల కేసులు
Covid cases in India: దేశంలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.41లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.1000కి ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికేట్- నిందితుడు అరెస్ట్
Fake vaccination certificate: రూ.1000 తీసుకుని కొవిడ్ వ్యాక్సిన్ ఫేక్ సర్టిపికెట్లు సృష్టిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీకా తీసుకోవడానికి సుముఖంగా లేని వారు ఇతన్ని సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - అమెరికాలో ఆగని కరోనా ఉద్ధృతి..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో లక్షల మంది వైరస్ బారినపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 27లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అమెరికాలోనే 8.5లక్షలు కేసులు రాగా.. ఫ్రాన్స్‌లో 3.28 లక్షలు వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, అర్జెంటీనా, టర్కీ, భారత్ వంటి దేశాల్లో లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. పూర్తివివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - ప్రభుత్వ కార్యాలయంలో భారీ పేలుడు- 16మంది మృతి
Blast in china office: చైనాలో ఓ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా.. మరో 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చాంగ్కింగ్ నగరంలో జరిగింది ఈ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - పాక్ పేసర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్
Dhoni Jersey to Pakistani Cricketer: పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రౌఫ్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. సంతకం చేసిన తన ఐపీఎల్ జెర్సీని అతడికి బహుమతిగా పంపించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కట్టప్ప' సత్యరాజ్‌కు కరోనా..
Actor Satyaraj corona positive: సీనియర్ నటుడు సత్యరాజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Top News Today : టాప్‌టెన్ న్యూస్ @11AM - ఏపీ ప్రధాన వార్తలు
ఇప్పటివరకు ప్రధానవార్తలు
top news 11 am
Last Updated : Jan 8, 2022, 11:10 AM IST