ప్రధాన వార్తలు @ 11AM
By
Published : Dec 30, 2021, 10:54 AM IST
| Updated : Dec 30, 2021, 10:59 AM IST
- Meeting On PRC: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ.. పీఆర్సీపై చర్చ
పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో మరోదఫా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- MLA Surrenders Gunmen: గన్మెన్లు లేకుండానే హైదరాబాద్‌కు ఎమ్మెల్యే.. అలకే కారణమా..!
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండ్ చేసినట్లు తెలిసింది. వారం రోజులు పాటు జిల్లాలో ఉంటటం లేదంటూ తనకు కేటాయించిన గన్మెన్లను సరెండ్ చేసినట్లు సమాచారం. నాగులుప్పలపాడు మండలంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలం స్వామివారిని దర్శించుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Ganja Report In Andhra Pradesh: రాష్ట్రంలో రోజుకు ఎంత గంజాయి పట్టుబడుతుందంటే..
రాష్ట్రంలో రోజుకు సగటున 633 కిలోల గంజాయి పట్టుబడుతోందని సెబ్ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ బుధవారం వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 13వేల మందికి వైరస్
దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 13,154 కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు. బుధవారం 63,91,282 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పదో తరగతి బాలుడితో ప్రేమాయణం.. ఉపాధ్యాయురాలు అరెస్ట్
పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన ఓ ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలుడిని వేధించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడు, అరియలూర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Azadi Ka Amrit Mahotsav: భారత్‌పై పెత్తనం కోసం ఆంగ్లేయుల 'లీగ్' ఆట!
డిసెంబరు 30... సంవత్సర ముగింపునకు సంకేతం! 1906లో కూడా భారతీయులు అలాగే అనుకుంటూ.. నిద్రలేచారు. కానీ జాతీయోద్యమంలో ఈ రోజు కొత్త మలుపునకు తెరలేవబోతోందని వారు ఊహించలేదు. అదే.. ముస్లిం లీగ్ ఆవిర్భావం! తమ 'విభజించు - పాలించు' సూత్రంలో భాగంగా ఆవిష్కృతమైన ముస్లిం లీగ్‌ను.. ఆంగ్లేయులు చివరి దాకా పెంచి పోషించుకుంటూ వచ్చారు! భారత లౌకికత్వాన్ని దెబ్బ తీయటమేగాకుండా.. ఈ 'లీగ్'ను అడ్డంపెట్టుకొని ఉపఖండంపై శాశ్వత పెత్తనం కోసం పెద్ద ఆటే ఆడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Stock Market Live: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Top 5 bowlers in 2021: ఈ ఏడాది టాప్-5 బౌలర్లు వీరే!
ఈ ఏడాది బ్యాటర్లతో పాటు బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. ఏకంగా సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలా ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సత్తా చాటిన టాప్-5 బౌలర్లపై ఓ లుక్కేద్దాం..
- RRR Pre Release Event: ఎన్టీఆర్ నాలో సగభాగం: రామ్ చరణ్
ఎన్టీఆర్ తనలో సగభాగమని చెప్పారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. అతడు లేనిదే 'ఆర్ఆర్ఆర్' లేదని కేరళలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. చరణ్ కూడా తనలో సగభాగమని, హృదయం ఎక్కడుందో చరణ్ అక్కడే ఉంటాడని చెప్పారు తారక్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Last Updated : Dec 30, 2021, 10:59 AM IST