- Live Updates: 'కొండపల్లికి తెదేపా కమిటీ'..
కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. కొండపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామన్న తెదేపా నేతల పిలుపుతో.. వారిని పోలీసులు ఎక్కడిక్కక్కడ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయంలో 10 గేట్లను... 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని (Hanuman birth place) పండిత పరిషత్ నిర్ధారణ చేసిందని తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశంలో కరోనా కేసులు(Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 41,649 మందికి వైరస్ సోకగా.. 37,291 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 593 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భీకర వర్షాలు- ఆరుగురు మృతి
బంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల ప్రభావంతో వివిధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు(Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం దిగివచ్చింది. ప్రధాన నగరాల్లో పది గ్రాముల మేలిమి పసిడి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వయాగ్రా తయారీలో వాడే కీలక ఔషధ మాత్రలను అమెరికాలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వీటిని భారత్‌లో తయారు చేశారని తెలుస్తోంది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.5.30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు శనివారం ఉదయం నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బాక్సింగ్‌లో ప్రపంచ నెం.1, భారత ఫేవరేట్ అమిత్ పంగాల్‌కు అనూహ్య ఓటమి ఎదురై.. నిష్క్రమించాడు. ఆర్చరీలో అతాను దాస్‌కు నిరాశే ఎదురైంది. మహిళల డిస్కస్ త్రోలో.. కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు చేరడమే భారత్‌కు సానుకూలాంశం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దర్శకుడు శంకర్-హీరో రామ్‌చరణ్ కాంబోలో తెరెకక్కనున్న సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్గా ఖరారైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.