ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - latest news ap

....

top news
ప్రధాన వార్తలు

By

Published : Jan 9, 2021, 11:03 AM IST

  • ముఖ్యమంత్రి జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు

ముఖ్యమంత్రి జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ఇటీవల నాంపల్లి నుంచి ఈడీ కోర్టుకు ఛార్జిషీట్‌ బదిలీ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 4 దశల్లో పంచాయతీ పోరు...జనవరి 23 నుంచే ఎన్నికలు

రాష్ట్రంలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 4 దశల్లో పోలింగ్ జరపాలని నిర్ణయించి.... ఎన్నికల ప్రక్రియలోని వివిధ తేదీలను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్రంప్​కు పట్టిన గతే.. సీఎం జగన్​కూ పడుతుంది: దేవినేని

సీఎం జగన్ వైఖరిపై మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. దేవాలయాల ధ్వంసంపై సీఎం స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే.. మంత్రి బొత్సతో చిలకపలుకులు పలికించారని ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు

నెల్లూరు శివారులోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. 29 మంది రైల్వే కూలీలకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్తగా 18,222 కేసులు-228 మరణాలు

దేశవ్యాప్తంగా కొత్తగా 18,222 మంది కరోనా బారిన పడ్డారు. మరో 228 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.39శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వీసా వ్యవస్థపై అమెరికాతో సంప్రదింపులు'

హెచ్​-1బీ వీసా ఎంపిక విధానాల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్​ స్పందించింది. వీసా వ్యవస్థతో పాటు ఇతర విషయాల్లో భారతీయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసుపత్రిలో కరోనా బాధితుడికి పుట్టినరోజు వేడుకలు

మహారాష్ట్ర మవాల్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగికి ఘనంగా పుట్టినరోజును నిర్వహించారు వైద్యులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐసీయూలోనే వేడుకలను నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. 24గంటల్లో మరో 3,825మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 244 ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 244 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. పుజారా (50) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాస్ ​మహారాజా 'క్రాక్' మార్నింగ్ షో రద్దు

రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' సినిమా నేడు (శనివారం) విడుదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ మార్నింగ్ షోస్ నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details