Tomoto Price Hike: ఉల్లిపాయ లేకుండా కూర ఎంత కష్టమో... టమాటా లేకున్నా అంతే. కూరలో టమాటా (Tomoto) వేస్తే ఇద్దరికి సరిపోయేది నలుగురికి సరిపోతుంది. అందుకే వినియోగదారులు మార్కెట్‌కు వచ్చినప్పుడల్లా కచ్చితంగా రెండు మూడు కేజీల చొప్పున టమాటాలు (Tomoto Price Hike) కొనుగోలు చేస్తారు. అయితే ఇదంతా నిన్నటి మాట. కిలో కాదు పావుకిలో టమాటా కొనాలంటే జంకే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ మార్కెట్లలో కిలో టమాటా వంద దాటేసింది. కాస్త బాగున్న టమాటా అయితే... నూట పది నుంచి నూట ఇరవై వరకు పలుకుతోంది.
150 దాటేలా...
వర్షాలతో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా (Tomoto) సరఫరా కాకపోవడం వల్ల వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో పావుకిలో అరకిలోతో జనం సరిపెట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే... మరో వారం పది రోజుల్లో రూ. 150 (Tomoto Price Hike) కూడా దాటేసే అవకాశాలు లేకపోలేదు.