హిందువుల మనోభావాలకు అనుగుణంగా భాజపా వెళ్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తెదేపా, వైకాపా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
భాజపా నోరు విప్పకూడదని వైకాపా అనుకుంటోందన్న సోము వీర్రాజు....మీరు మతతత్వం ప్రోత్సహించి చర్చిలు కట్టించవచ్చా? అని ప్రశ్నించారు. మెజారిటీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడితే మతతత్వం అంటారా? అని సోము వీర్రాజు నిలదీశారు.
రేపు ఉదయం తాము రామతీర్థం వెళ్తామని సోము వీర్రాజు ప్రకటించారు. శ్రీశైలాన్ని అన్యమతస్థులు నడుపుతున్నారని ఆరోపించారు. ఈ నెల 20 తర్వాత భాజపా యాత్ర చేపడుతుందని సోము వీర్రాజు వివరించారు. ఇళ్ల స్థలాల్లో రూ.4 వేల కోట్లు తినేశారన్న సోము వీర్రాజు...స్థానిక ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.