ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు.. రేపు గవర్నర్​తో ఎస్​ఈసీ భేటీ! - ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్.. బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​తో భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్​లో సమావేశమవుతారు.

tomorrow ap sec ramesh kumar  to meet  governor
tomorrow ap sec ramesh kumar to meet governor

By

Published : Nov 17, 2020, 9:34 PM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ ఎస్ఈసీ చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్.. బుధవారం గవర్నర్​తో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తున్నామని.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి షెడ్యూల్ ఖరారు చేస్తామని ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టడం, కేంద్రం నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉన్నందున ఎన్నికల నిర్వహణ చేపట్టవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే బిహార్ అసెంబ్లీ సహా తెలంగాణలోనూ దుబ్బాక ఉప ఎన్నిక పూర్తి చేశారు. హైదరాబాద్​లో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేశారు. రేపటి గవర్నర్ సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు అనుకూల అంశాలు సహా ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్​కు ఎస్ఈసీ తెలియజేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఇస్తోన్న నివేదికలనూ కూడా గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల నిర్వహించాలని కొందరు హైకోర్టులో వేసిన పిటిషన్​పై వాదనలు చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై హైకోర్టు కూడా త్వరలోనే తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details