ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్... అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ - cm jagan to tour of indrakiladri news

బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్ ప్రభుత్వం తరపున విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

cm jagan
cm jagan

By

Published : Oct 20, 2020, 4:44 PM IST

దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రభుత్వం తరపున సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్ నిబంధనల రీత్యా ఇప్పటికే రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనాలకు ప్రభుత్వం అనుమతిస్తోంది. మూలా నక్షత్రం కావటంతో తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల సంఖ్యను కూడా ఇదేస్థాయిలో పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రాక సందర్భంగా భక్తుల రాకను కొద్దిసేపు నియంత్రించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details