లవ్‌స్టోరీ సినిమా(Love story movie) తీయడానికి ప్రధాన కారణం పిల్లలే అని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Tollywood director sekhar kammula) అన్నారు. పిల్లల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులే(child abuse) తనను ఆ సినిమా తీయడానికి ప్రేరేపించాయని తెలిపారు. తన సినిమా ద్వారా చాలా మంది తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న విషయాలను బయటకు చెప్పగలిగారని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యను సినిమాగా తీయడం చాలా కష్టమని.. కానీ ఆ విషయంలో తాను సక్సెస్ అయ్యానని చెప్పారు.
బాలల దినోత్సవం(Children's day 2021) సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్(learning space foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల(director sekhar kammula) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిల్డ్రన్ సేఫ్టీ ప్లెడ్జ్(children's safety pledge)ను ఆవిష్కరించారు. పిల్లల భద్రతపై లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి సంక్లిష్టమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
చిన్నారుల భద్రత(child safety) చాలా ముఖ్యమని శేఖర్ కమ్ముల(director sekhar kammula) అన్నారు. వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు. పిల్లలపై లైంగిక వేధింపుల సమస్యపై అవగాహన కల్పించేందుకు సినిమా మంచి మార్గమని తెలిపారు. కానీ.. ఇలాంటి సమస్య సినిమాగా తీయడం చాలా కష్టమని.. తాను ఆ విషయంలో సక్సెస్ అయ్యానన్నారు. లైంగిక వేధింపులు(sexual harassment) అమ్మాయిలకే కాదని.. అబ్బాయిల(sexual abuse on boys)పై కూడా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు.
"పిల్లలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమయ్యాయి. వేధింపులు పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మానసికంగా వారిని చాలా కుంగదీస్తాయి. నేను లవ్‌స్టోరీ సినిమా తీశాక.. చాలా పాఠశాలలకు వెళ్లాను. అక్కడ చాలా మంది విద్యార్థులతో మాట్లాడాను. 100లో 70 శాతం పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసి చాలా బాధేసింది. ఇలా వేధింపులకు గురవుతున్న వారు.. ఎవరికి తెలియాలో చెప్పక.. చెబితే ఏమంటారోనని భయపడుతూ.. వారిలోనే మథనపడుతున్నారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి చెప్పినా.. వారు నమ్మకపోవడం.. సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇంకా మానసిక వేదనకు గురవుతున్నారు."