ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాసేపట్లో సీఎం జగన్‌ను కలవనున్న సినీ ప్రముఖులు

tollywood bigwigs meet cm jagan : సినీరంగ ప్రముఖులు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్‌, పలువురు సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సినిమా టికెట్‌ ధరల పెంపు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది

సీఎం జగన్‌ను కలవనున్న సినీ ప్రముఖులు
సీఎం జగన్‌ను కలవనున్న సినీ ప్రముఖులు

By

Published : Feb 10, 2022, 9:40 AM IST

Updated : Feb 10, 2022, 11:20 PM IST

tollywood bigwigs meet cm jagan : రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ముఖ్యమంత్రితో నేడు సినీ ప్రముఖులు చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు చిరంజీవి, మహేశ్‌బాబు, మహేశ్ బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ ప్రముఖులు..సీఎం జగన్​తో భేటీ కానున్నారు. సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు, థియేటర్‌ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా, సినిమా రంగానికి ప్రభుత్వపరంగా అందాల్సిన సహకారంపైనా చర్చించనున్నారు. హైదరాబాద్​లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సినీ ప్రముఖులు బయల్దేరారు.

సినిమా టికెట్ల సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నా. ఇరుపక్షాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పటికే చిరంజీవి వెళ్తున్నారు. ఒక ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు?

-అల్లు అరవింద్‌

ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం హాట్‌టాపిక్‌

ఇటీవల ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా, ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్‌ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాదు, థియేటర్‌లలో మౌలిక సదుపాయాలు, క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలపైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి

Last Updated : Feb 10, 2022, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details