జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల రూపంలో బాదుడు మొదలు కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి. వీటి ప్రకారం కారు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 10 రూపాయలు, బస్సులు, లారీలకు 15 నుంచి 25 రూపాయలు, భారీ వాహనాలకు 40నుంచి 50 రూపాయల వరకు టోల్ రుసుం పెరగనుంది. సింగిల్, డబుల్ ట్రిప్లతో పాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ఏడాదికి 2,409 కోట్ల రూపాయల వరకు వసూలవుతోంది. తాజాగా పెంచుతున్న ఫీజులతో ఇది మరింత పెరగనుంది.
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెంపు - ap updates
జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెరుగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.

Toll fees