ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం' - telangana varthalu

దేశానికి పతకం అందించడం ఎంతో గర్వంగా ఉందని ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.

sindhu pc
sindhu pc

By

Published : Aug 4, 2021, 6:12 PM IST

'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు తన విజయానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశానికి ఓ పతకం అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్​లోని తన నివాసానికి చేరుకున్న సింధు.. తన కోచ్, ఇతర సిబ్బందితో తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. కోచ్​​తో పాటు పలువురు తనను ఎంతో ప్రోత్సహించారని ఆమె తెలిపారు. వారి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందన్నారు కరోనా సమయంలో కూడా కోచ్​ ట్రైనింగ్​ విషయంలో ఎంతో సహకరించారని పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారని సింధు స్పష్టం చేశారు. వారు చిన్నప్పటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని ఆమె చెప్పారు. టోక్యోలో దేశం నుంచి కొందరు మీడియా ప్రతినిధులు తనను ఎంతో ప్రోత్సహించారని పీవీ సింధు వెల్లడించారు.

అందరికీ కృతజ్ఞతలు

దేశానికి పతకం అందించనందుకు సంతోషంగా ఉంది. నేను టోక్యోలో చాలా మిస్సయ్యాను. కానీ మీ దీవెనల వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాను. నా కోచ్​ పార్క్​ గారికి కృతజ్ఞతలు. ఆయన దాదాపు సంవత్సరం నుంచి నాకు కోచింగ్​ ఇస్తున్నారు. సుచిత్ర అకాడమీకి కూడా కృతజ్ఞతలు. మా పేరెంట్స్​కు కూడా ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నేనొక్కదాన్నే కాదు.. అందరూ కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది. -పీవీ సింధు, ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత

ఇదీ చదవండి:

Tokyo Olympics: హాకీ సెమీస్​లో భారత మహిళా జట్టు ఓటమి

Pv Sindhu: శంషాబాద్​ విమానాశ్రయంలో సింధుకు ఘన స్వాగతం

ABOUT THE AUTHOR

...view details