ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ విచారణ - hearing on petitions related to Amaravathi

రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరగనుంది. రాజధానికి సంబంధించి ఇప్పటివరకు 90కిపైగా వ్యాజ్యాలు దాఖలు కాగా.. మరికొన్ని నూతనంగా వేసే అవకాశం ఉంది. ఇవాళ్టి విచారణలో వ్యాజ్యాల ఏవిధంగా విచారించాలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Today's hearing on petitions related to capital matters
రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ విచారణ

By

Published : Oct 5, 2020, 5:18 AM IST

రాజధానికి సంబంధించిన అంశాల గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ... దాఖలైన పిటిషన్లు, విశాఖలో గెస్ట్​హౌస్ నిర్మాణం, హైకోర్టుకు శాశ్వత భవనాల నిర్మాణం, ఆర్-5 జోన్లు ఏర్పాటు తదితర అంశాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. విశాఖలో గెస్ట్​హౌస్ నిర్మాణంపై దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కౌంటర్ దాఖలు చేయాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం చేసిన రెండు చట్టాలపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించింది.

రాజధానికి సంబంధించి ఇప్పటివరకు 90కిపైగా వ్యాజ్యాలు దాఖలు కాగా.. మరికొన్ని నూతనంగా వేసే అవకాశం ఉంది. అత్యధికంగా పిటిషన్లు దాఖలైనందున... విచారణ ప్రత్యక్షంగా చేయాలని కొంతమంది.. ఆన్​లైన్ ద్వారా చేయాలని మరికొంత మంది న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. హైబ్రిడ్ పద్ధతిలో చేయాలని మరికొంత మంది న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ్టి విచారణలో వ్యాజ్యాల ఏవిధంగా విచారించాలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్పష్టత వచ్చిన తర్వాత రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండీ... వంశీ అద్దె నేత.. అసలైన వైకాపా నాయకుడిని నేనే: వెంకట్రావు

ABOUT THE AUTHOR

...view details