రాష్ట్రంలో ఇవాళ కూడా 10 వేలకు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 10, 368 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. తాజా బులెటిన్లో ప్రకటించింది. వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య.. 4,45,139కి చేరింది.
లక్ష మార్క్ ను దాటిన యాక్టివ్ కేసులు
తాజా నివేదిక ప్రకారం.. మరో 84 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. వీరితో కలిపి మృతుల సంఖ్య.. 4,053 కు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో.. 3,39,876 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం.. ఏపీలో 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన.. యాక్టివ్ కేసులు నేటితో లక్ష మార్క్ ను దాటాయి. అలాగే... గడచిన 24 గంటల వ్యవధిలో 59,834 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరితో కలిపి.. పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య.. 37 లక్షల 82 వేల మందికి పెరిగింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,068.. నెల్లూరు జిల్లాలో 1,059.. కడప జిల్లాలో 994.. పశ్చిమ గోదావరి జిల్లాలో 948.. ప్రకాశం జిల్లాలో 888.. విశాఖ జిల్లాలో 825.. కర్నూలు జిల్లాలో 813.. శ్రీకాకుళం జిల్లాలో 629.. గుంటూరు జిల్లాలో 617.. విజయనగరం జిల్లాలో 552.. అనంతపురం జిల్లాలో 456.. కృష్ణా జిల్లాలో 311 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మృతుల వివరాలు
తాజా నివేదిక ప్రకారం.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 11.. తూర్పు గోదావరి జిల్లాలో 10.. అనంతపురం, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఆరుగురు.. కడప జిల్లాలో ఐదుగురు.. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున.. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి:
దేశంలో కొత్తగా 69,921 కేసులు.. 819 మరణాలు