నేడు కూడా రాష్ట్రంలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా నివేదిక ప్రకారం.. మరో 10 వేల 392 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 4 లక్షల 55 వేల 531కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి మృతుల సంఖ్య 4,125 కు చేరింది.
మొత్తంగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3 లక్షల 48 వేల 330 గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్షా 3 వేల 76 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 60 వేల 804 మందికి ప్రభుత్వం కరోనా నిర్థరణ పరీక్షలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 38 లక్షల 43 వేల 550 మందిని పరీక్షించింది.
తాజాగా వెలుగు చూసిన కేసుల్లో..
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,199.. చిత్తూరు జిల్లాలో 1,124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 942.. గుంటూరులో 900.. పశ్చిమ గోదావరి జిల్లాలో 885.. అనంతపురంలో 810.. కడప, ప్రకాశం జిల్లాల్లో 800 చొప్పున... కర్నూలులో 697... విశాఖలో 675.. శ్రీకాకుళంలో 603.. విజయనగరంలో 560.. కృష్ణా జిల్లాలో 397 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మృతులు
గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా.. నెల్లూరులో 11 మంది చనిపోయారు. చిత్తూరులో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 9.. ప్రకాశంలో 8.. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున.. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున.. విజయనగరంలో ముగ్గురు.. కడపలో ఇద్దరు.. కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు.
ఇదీ చదవండి:
మొబైల్ సాయంతో అరగంటలో కరోనా పరీక్ష ఫలితం